సాయిచంద్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ పరామర్శ..
సాయిచంద్ కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. సాయిచంద్ లేని లోటు తీర్చలేనిదని, ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇటీవల అకాల మరణం చెందిన సాయిచంద్ కి సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించారు. హైదరాబాద్ హస్తినాపురంలోని జీఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన సాయిచంద్ దశదిన కర్మకు కేసీఆర్ హాజరయ్యారు. సాయిచంద్ చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించారు.
తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ వేద సాయిచంద్ దశ దినకర్మ కార్యక్రమానికి హాజరై ఘన నివాళులర్పించిన సీఎం శ్రీ కేసీఆర్. pic.twitter.com/88cOPG6BhG
— BRS Party (@BRSparty) July 9, 2023
కుటుంబ సభ్యులకు పరామర్శ..
సాయిచంద్ కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. సాయిచంద్ లేని లోటు తీర్చలేనిదని, ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి.. తదితరులు పాల్గొన్నారు. సాయిచంద్ అమర్ రహే అంటూ ఆయన అభిమానులు నినాదాలు చేశారు.
కుటుంబానికి ఆర్థిక సాయం..
సాయిచంద్ కుటుంబానికి బీఆర్ఎస్ తరపున ఆర్థిక సాయం ప్రకటించారు. కోటిన్నర రూపాయలు కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. సాయిచంద్ పిల్లల పేరుమీద వాటిని ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తున్నారు. అదే సమయంలో సాయిచంద్ తండ్రి, చెల్లెలకు కూడా ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. సాయిచంద్ భార్య రజినిని రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్ పర్సన్ గా నియమించారు.