Telugu Global
Telangana

ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈరోజు సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. పీఆర్సీతోపాటు, మధ్యంతర భృతి(ఐఆర్)పై వారు కేసీఆర్ కి వినతిపత్రాలు అందించారు.

ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం
X

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటూ వారి చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం కేసీఆర్, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా తీపి కబురు చెప్పబోతున్నారు. పీఆర్సీ కమిటీని నియమిస్తూనే ఐఆర్ పై కూడా ఇప్పుడే క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశముంది. ఈరోజు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

గెజిటెడ్ ఉద్యోగులు, నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈరోజు సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. పీఆర్సీతోపాటు, మధ్యంతర భృతి(ఐఆర్)పై వారు కేసీఆర్ కి వినతిపత్రాలు అందించారు. ఇప్పటికే వీటి గురించి చర్చిస్తున్నామని, త్వరలో ప్రకటన విడుదల చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి.

భాగ్యనగర్ టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ భూమి కేటాయింపు ఉత్తర్వులపై కూడా నేతలు కేసీఆర్ కి వినతిపత్రం అందించారు. దీన్ని పరిశీలించిన సీఎం.. ఉత్తర్వుల విషయంలో సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. హెల్త్ కార్డులపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తో జరిగిన సమావేశంపై హర్షం వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘాల నేతలు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా పాల్గొన్నారు.

First Published:  3 Aug 2023 4:44 PM IST
Next Story