Telugu Global
Telangana

నన్ను గెలిపించండి.. బీఆర్ఎస్ లో చేరతా..

మంచిర్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే వాడకో పేకాట క‌బ్ల్ వస్తుందన్నారు కేసీఆర్. మంచిర్యాల నిండా పేకాట క్ల‌బ్బులు ఉంటాయన్నారు.

నన్ను గెలిపించండి.. బీఆర్ఎస్ లో చేరతా..
X

తెలంగాణలో గెలవలేమని కాంగ్రెస్ వాళ్లకు అర్థమైందని, ఇప్పుడు వారు కొత్త పద్ధతి మొదలుపెట్టారని.. నన్ను కూడా గెలిపించండి, నేను కూడా బీఆర్ఎస్ లో చేరతానని ఓటర్లను బతిమిలాడుకుంటున్నారని, మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఇలాగే బతిమిలాడుతున్నాడని తెలిసిందని అన్నారు సీఎం కేసీఆర్. మంచిర్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. వారి మాటలు నమ్మొద్దని, బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించండి అని పిలుపునిచ్చారు.


కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఏం జరుగుతుందంటే..?

మంచిర్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే వాడకో పేకాట క‌బ్ల్ వస్తుందన్నారు కేసీఆర్. మంచిర్యాల నిండా పేకాట క్ల‌బ్బులు ఉంటాయన్నారు. ఇళ్లు కూడా అమ్ముకుని పేకాటలో పెట్టాల్సి వస్తుంది జాగ్రత్త అని హెచ్చరించారు. ఎల్ల‌మ్మ కూడ‌బెడితే మ‌ల్ల‌మ్మ మాయం చేసింద‌న‌ట్టు కాంగ్రెస్ గెలిస్తే ఈ ప‌దేళ్ల క‌ష్టం బూడిద‌లో పోసిన ప‌న్నీరు అవుతుందన్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాక‌ర్ రావుని మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కేసీఆర్.

దివాక‌ర్ రావు తనను ఎప్పుడూ వ్య‌క్తిగ‌త ప‌నులు అడ‌గ‌లేదని, పొలాల‌కు నీళ్లు రావాలి, లిఫ్టులు కావాల‌ని అడిగారని చెప్పారు కేసీఆర్. గోదావ‌రిపై క‌ర‌క‌ట్ట క‌ట్టి మంచిర్యాల‌కు చుక్క వ‌ర‌ద‌ నీరు రాకుండా చేసే బాధ్య‌త తనదేనని చెప్పారు. ఈ ఎండాకాలమే ఆ పని మొదలు పెట్టి శరవేగంగా పూర్తి చేస్తామన్నారు. మంచి పనులు చేసుకుందాం మరోసారి బీఆర్ఎస్ ని ఆశిర్వదించండని కోరారు కేసీఆర్.


First Published:  24 Nov 2023 3:12 PM IST
Next Story