నాగర్ కర్నూల్ లో ప్రారంభోత్సవాల సంబరం
నాగర్ కర్నూల్ సమీకృత కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టరేట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. చాంబర్ లో కలెక్టర్ ఉదయ్ కుమార్ ను కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. వరుస ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కార్యాలయం ఆవరణలో పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ తల్లికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Watch Live: BRS President, CM Sri KCR inaugurating the BRS Party Nagarkurnool district office. https://t.co/03KqXmvxtY
— BRS Party (@BRSparty) June 6, 2023
అనంతరం నాగర్ కర్నూల్ సమీకృత కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టరేట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. చాంబర్ లో కలెక్టర్ ఉదయ్ కుమార్ ను కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. రూ.52 కోట్లతో జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాల శివారులోని కొల్లాపూర్ చౌరస్తాలో 12ఎకరాల స్థలంలో కలెక్టరేట్ నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తుల్లో నిర్మాణం జరిగింది. ఇక్కడే 32శాఖల కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి.
Live: CM Sri KCR inaugurating Nagarkurnool District Integrated Offices' Complex. https://t.co/XC0Xu9IErL
— Telangana CMO (@TelanganaCMO) June 6, 2023
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్పీ కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ కు హోం మంత్రి మహమూద్ అలీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ అంజనీకుమార్, ఎస్పీ మనోహర్ ఘన స్వాగతం పలికారు. రూ.35 కోట్లతో పోలీసు భవన సముదాయాలను ఇక్కడ నిర్మించారు.