కేటీఆర్ ని ఆ విషయంలో అభినందిస్తున్నా -కేసీఆర్
షోలాపూర్ లాగా సిరిసిల్లను కూడా వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, గొప్ప విద్యాకేంద్రంగా మారుస్తున్నామని చెప్పారు కేసీఆర్.
సిరిసిల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దశనుంచి, ఇప్పుడు కాస్త కుదుటపడ్డారని, వారి కష్టాలు తీరాయని.. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ని అభినందిస్తున్నానని చెప్పారు సీఎం కేసీఆర్. సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. మరోసారి కేటీఆర్ ని దీవించాలని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితేనే అభివృద్ధి కొనసాగుతుందన్నారు.
❌రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీ కావాలా ?
— BRS Party (@BRSparty) October 17, 2023
✅24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీ కావాలా ?
- సిరిసిల్ల సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్#KCROnceAgain #VoteForCar pic.twitter.com/3qPSW6EijL
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ప్రమాదం పొంచి ఉందని, రైతులు మళ్లీ కష్టాలపాలవుతారని చెప్పారు సీఎం కేసీఆర్. ఆ పార్టీ భుజం మీద గొడ్డలి పెట్టుకుని రెడీగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ వస్తే 3 గంటలే కరెంట్ వస్తుందని, ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారని, రైతుల పొలాలకు యాజమాన్య హక్కులు గల్లంతవుతాయని హెచ్చరించారు. ఆపద మొక్కులు మొక్కేవారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు కేసీఆర్.
షోలాపూర్ లాగా సిరిసిల్లను కూడా వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, గొప్ప విద్యాకేంద్రంగా మారుస్తున్నామని చెప్పారు కేసీఆర్. నీళ్లు పుష్కలంగా వచ్చాయని, అన్ని హంగులు సిరిసిల్ల ప్రాంతానికి వస్తాయని అన్నారు. అనేక రంగాల్లో.. మనం నెంబర్-1గా ఉన్నామని చెప్పారు. మేనిఫెస్టోలో తాము చేయలేని పనులేవీ చెప్పలేదని, అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని హామీలిచ్చామని, అధికారంలోకి వచ్చాక వాటన్నిటినీ నెరవేరుస్తామని చెప్పారు కేసీఆర్.