Telugu Global
Telangana

ఇబ్రహీం పట్నంకు ఏమేం వస్తున్నాయంటే..?

కాంగ్రెస్ నేతలు ధరణి తీసేస్తాం, 3 గంటలే కరెంటు ఇస్తామని ఓపెన్ గా చెబుతున్నారని, అలా చెప్పినా కూడా కాంగ్రెస్ కి ఓటేస్తే ఆ తర్వాత ఎవరూ ఏం చేయలేరని అన్నారు కేసీఆర్. ఎంత మొత్తుకున్నా లాభం లేదన్నారు.

ఇబ్రహీం పట్నంకు ఏమేం వస్తున్నాయంటే..?
X

హైదరాబాద్ పక్కనే ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ముఖచిత్రం త్వరలో మారిపోతుందని అన్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి రూ.700 కోట్ల‌తో రోడ్ల‌న్నీ అభివృద్ధి చేశారని, కొన్నింటిని డ‌బుల్ చేశారని చెప్పారు. త్వరలో అద్భుత‌మైన రీజిన‌ల్ రింగ్ రోడ్డు వ‌స్తుందని హామీ ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్ తో ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ ముఖ‌చిత్రం మారిపోతుందన్నారు కేసీఆర్.


క‌లెక్ట‌రేట్ ఇక్క‌డే ఏర్పాటు చేసుకున్నామని, పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు సీఎం కేసీఆర్. ల‌క్ష మందికి ఉద్యోగాలు క‌ల్పించే ఫాక్స్ కాన్ ప‌రిశ్ర‌మ కూడా ఇక్క‌డికే వ‌స్తుందని చెప్పారు. 600 ఎక‌రాల భూమిని పరిశ్రమలకోసం ఉంచామని, కాలుష్యం లేని ఇండ‌స్ట్రీలు కావాలని ఎమ్మెల్యే కోరారని, గ్యారెంటీగా అవి వస్తాయన్నారు. ఇవ‌న్నీ జ‌ర‌గాలంటే కిష‌న్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

తెలంగాణ‌కు ఒక్క మెడిక‌ల్ కాలేజీ, న‌వోద‌య పాఠ‌శాల ఇవ్వ‌ని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. బావుల కాడ మీట‌ర్లు పెట్టాల‌ని మోదీ బెదిరించాడని, చ‌చ్చినా పెట్ట‌ను అని చెప్పానని, అలా చేస్తే సంవ‌త్స‌రానికి రూ. 5 వేల కోట్లు బ‌డ్జెట్ క‌ట్ చేస్తానన్నారని, అయినా మీటర్లు పెట్టలేదని చెప్పారు కేసీఆర్. ఐదేళ్లలో రూ. 25 వేల కోట్లు కట్ చేసినా కాంప్రమైజ్ కాలేదన్నారు. దేశ వ్యాప్తంగా 157 మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేసింది కేంద్రం తెలంగాణకు మాత్రం సున్నా చుట్టిందని మండిపడ్డారు. జిల్లాకో న‌వోద‌య పాఠ‌శాల పెట్టాల‌ని చ‌ట్టం ఉన్నా, కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపించిందన్నారు. న‌వోద‌య పాఠ‌శాల‌ల కోసం 100 ఉత్త‌రాలు రాసినా ప్రధాని మనసు కరగలేదన్నారు. కాంగ్రెస్ నేతలు ధరణి తీసేస్తాం, 3 గంటలే కరెంటు ఇస్తామని ఓపెన్ గా చెబుతున్నారని, అలా చెప్పినా కూడా కాంగ్రెస్ కి ఓటేస్తే ఆ తర్వాత ఎవరూ ఏం చేయలేరని అన్నారు కేసీఆర్. ఎంత మొత్తుకున్నా లాభం లేదన్నారు. ఏది మంచిదో ఏది చెడ్డదో ఎవరికి ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలన్నారు.

First Published:  14 Nov 2023 7:17 PM IST
Next Story