జగ్గారెడ్డి ఉద్యమ ద్రోహి.. ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయిన వ్యక్తి
"మీ లోకల్ ఎమ్మెల్యే మొదట్లో టీఆర్ఎస్‌లో ఉండే. ఉద్యమ ద్రోహి అయి అమ్ముడుపోయిండు. ఆ విషయం మీక్కుడా తెలుసు. ఈయన ఏనాడైనా తెలంగాణ కోసం ఉన్నాడా". ఇలాంటి ఎమ్మెల్యేలా మనకు కావాల్సింది అంటూ ఓటర్లను ప్రశ్నించారు సీఎం కేసీఆర్.
జగ్గారెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయిన వ్యక్తి అంటూ మండిపడ్డారు. సంగారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్... జగ్గారెడ్డిపై నిప్పులు చెరిగారు. "మీ లోకల్ ఎమ్మెల్యే మొదట్లో టీఆర్ఎస్‌లో ఉండే. ఉద్యమ ద్రోహి అయి అమ్ముడుపోయిండు. ఆ విషయం మీక్కుడా తెలుసు. ఈయన ఏనాడైనా తెలంగాణ కోసం ఉన్నాడా". ఇలాంటి ఎమ్మెల్యేలా మనకు కావాల్సింది అంటూ ఓటర్లను ప్రశ్నించారు సీఎం కేసీఆర్.
తెలంగాణకు కాంగ్రెస్ గానీ, ఆ పార్టీ నాయకులు గానీ ఏం చేశారని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. "ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపించింది తెలంగాణ కాంగ్రెస్సే. నీళ్లు ఇవ్వకపోతే సప్పుడు చేయనిది తెలంగాణ కాంగ్రెస్సే. ఉద్యోగాల్లో దోపిడీ జరుగుతుంటే నోరు తెరవనిది తెలంగాణ కాంగ్రెస్సే అంటూ హస్తం పార్టీపై విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్.
తెలంగాణకు శాపమే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అన్నారు సీఎం కేసీఆర్." కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేస్కోండి అన్నరు. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే గానీ, మంత్రి గానీ ఒక్కరైనా కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించారా?. మా ప్రాంతానికి రూపాయి ఇయ్యను అని నువ్వెంట్లటవ్ అని నిలదీశారా?. పోనీ స్వరాష్ట్రం కోసం రాజీనామా చేశారా? అదే బీఆర్ఎస్‌ను చూడండి. పదవులను గడ్డిపోచల్లెక విసిరి పారేశాం. ఎన్నిసార్లు రాజీనామా చేశామో మాకే తెల్వదు. తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడినం". ఇప్పుడు ఇంతలా మాట్లాడుతున్న ఏ ఒక్కడు కూడా అప్పుడు రాలేదన్నారు సీఎం కేసీఆర్.