Telugu Global
Telangana

మీ ఈడీ, బోడీలకు భయ‌పడడానికి బీబీసీ ఏమైనా జీన్యూసా ? -కేసీఆర్

దేశంలో ప్రస్తుతం దారుణ‌మైన పరిస్థితులు నెలకొన్నాయని, నిజ‍ం మాట్లాడిన వాళ్ళనుజైళ్ళలో పెడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. మోడీ అదానీకి అండగా నిలబడుతున్నారని, మరో వైపు అడ్డగోలుగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటుపరం చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు.

మీ ఈడీ, బోడీలకు భయ‌పడడానికి బీబీసీ ఏమైనా జీన్యూసా ? -కేసీఆర్
X

మీ ఈడీ, బోడీలకు భయ‌పడడానికి బీబీసీ ఏమైనా జీన్యూసా ? -కేసీఆర్

ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లతో పార్లమెంటులో రాజకీయం చేస్తున్నారని అసెంబ్లీలో కేసీఆర్ విరుచుకపడ్డారు. పార్లమెంటులో మోడీ, రాహుల్ గాంధీలు మాట్లాడిన విధానంపై ఆయన మండిపడ్డారు. ఎవరెన్ని ప్రభుత్వాలను కూల్చేశారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పార్లమెంటులో రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భం గా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, మన దేశ తలసరి ఆదాయం శ్రీలంక, బాంగ్లా దేశ లకన్నా వెనకపడిపోయిందని, 192 దేశాల్లోమన దేశం ర్యాంక్ 139 అని కేసీఆర్ అన్నారు. రు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనేది పెద్ద జోక్ అని చెప్పిన కేసీఆర్ మన దేశం 3.3 ట్రిలియన్ డాలర్ల దగ్గరే ఆగిపోయిందన్నారు.

దేశంలో ప్రస్తుతం దారుణ‌మైన పరిస్థితులు నెలకొన్నాయని, నిజ‍ం మాట్లాడిన వాళ్ళనుజైళ్ళలో పెడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. మోడీ అదానీకి అండగా నిలబడుతున్నారని, మరో వైపు అడ్డగోలుగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటు పరం చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. లాభాలొస్తే ప్రైవేటుకిస్తూ, నష్టాలొస్తే ప్రజలపై భారం మోపుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు.


గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీని ప్రసారం చేసినందుకు బీబీసీ న్యూస్ ఛానల్ ను ఈ దేశంలో నిషేధించాలని ఓ బీజేపీ లాయర్ సుప్రీం కోర్టులో కేసు వేశారని కేసీఆర్ అన్నారు. నిజాలు ప్రసారం చేస్తే బ్యాన్ చేస్తారా ? మీ ఈడీకి, బోడీకి భయపడడానికి బీబీసీ ఏమైనా జీ న్యూసా ? అని అన్నారు కేసీఆర్.

First Published:  12 Feb 2023 6:40 PM IST
Next Story