Telugu Global
Telangana

జాబితాలో సూపర్ స్పీడ్.. కేసీఆర్ వ్యూహం ఎలా కలిసొచ్చిందంటే..?

సీఎం కేసీఆర్ ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించడంతో చేరికలు బీఆర్ఎస్ కి లాభమే కానీ నష్టం కలిగించే అవకాశం లేదు. కాంగ్రెస్ విషయంలో మాత్రం ప్యారాచూట్ నేతల వల్ల మిగతా వాళ్లు అలిగి బయటకు వెళ్లిపోతున్నారు.

జాబితాలో సూపర్ స్పీడ్.. కేసీఆర్ వ్యూహం ఎలా కలిసొచ్చిందంటే..?
X

జాబితాలో సూపర్ స్పీడ్.. కేసీఆర్ వ్యూహం ఎలా కలిసొచ్చిందంటే..?

- నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీఆర్ఎస్ లోకి వస్తున్నారు. కానీ నాగర్ కర్నూల్ టికెట్ అడిగే ఛాన్స్ లేదు. పైగా స్థానిక అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డితో కలసి పనిచేస్తానన్నారు

- పీజేఆర్ తనయుడు విష్ణువర్దన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లోకి వస్తున్నారు. జూబ్లీహిల్స్ లో టికెట్ అడిగే పరిస్థితి లేకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలుపుకోసం కృషి చేస్తానని చెబుతున్నారు.

- ఇటీవల పార్టీలో చేరిన ఎర్ర శేఖర్ అయినా, కాస్త ముందుగా గులాబి కండువా కప్పుకున్న పొన్నాల లక్ష్మయ్య అయినా బేషరతుగా బీఆర్ఎస్ లో చేరారు. ఎలాంటి డిమాండ్లు చేయలేదు.

వీటన్నిటికీ కారణం ఒకటే బీఆర్ఎస్ ఇప్పటికే జాబితా ప్రకటించి ప్రచారంలో దూసుకుపోవడం. ఎన్నికలనగానే మిగతా పార్టీలన్నీ అభ్యర్థులకోసం వెదుకులాట మొదలుపెడతాయి. కానీ కేసీఆర్ మాత్రం ఓ అడుగు ముందుకేసి అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. ఈసారి కూడా ఈ వ్యూహం బీఆర్ఎస్ కి బ్రహ్మాండంగా కలిసొచ్చింది. కాంగ్రెస్ అసంతృప్తులు బీఆర్ఎస్ వైపు వస్తున్నా టికెట్ డిమాండ్ చేయలేని పరిస్థితి. అదే సమయంలో స్థానిక నేతలకు వారు మరింత బలాన్నిస్తున్నారు. బీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకగా మార్చేస్తున్నారు.

కాంగ్రెస్ పరిస్థితి వేరు..

ఇతర పార్టీలనుంచి కాంగ్రెస్ లోకి కూడా నాయకులు వస్తున్నారు. కానీ వారు టికెట్ ఆఫర్ ఖరారైన తర్వాతే కండువా మార్చుకుంటున్నారు. తుమ్మల, పొంగులేటి, జూపల్లి, మైనంపల్లి.. అందరూ ఇదే బాపతు. ఇటీవల బీజేపీ నుంచి ఫిరాయించిన రాజగోపాల్ రెడ్డి కూడా టికెట్ హామీ తీసుకున్నాకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కానీ ఇతర పార్టీలనుంచి బీఆర్ఎస్ లో చేరుతున్నవారెవరూ టికెట్లు అడిగే పరిస్థితి లేదు. అలాగని స్థానిక అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా లేదు.

సీఎం కేసీఆర్ ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించడంతో చేరికలు బీఆర్ఎస్ కి లాభమే కానీ నష్టం కలిగించే అవకాశం లేదు. కాంగ్రెస్ విషయంలో మాత్రం ప్యారాచూట్ నేతల వల్ల మిగతా వాళ్లు అలిగి బయటకు వెళ్లిపోతున్నారు. బీఆర్ఎస్ లో చేరి, కాంగ్రెస్ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసేందుకు సై అంటున్నారు.

First Published:  30 Oct 2023 7:39 AM GMT
Next Story