Telugu Global
Telangana

గెలుపు మనదే.. ఆగం కావొద్దు - కేసీఆర్

తెలంగాణలో ఎగ్జిట్‌ పోల్స్ కాంగ్రెస్‌కు మొగ్గు చూపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ కేబినెట్‌ భేటీకి పిలుపునివ్వడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది.

గెలుపు మనదే.. ఆగం కావొద్దు - కేసీఆర్
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి సస్పెన్స్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు మొగ్గు చూపినప్పటికీ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 4 మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరుగుతుందని సీఎంవో స్పష్టం చేసింది.

బీఆర్ఎస్‌కు చెందిన 25 మంది నేతలు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారందరికి భరోసా కల్పించినట్లు తెలుస్తోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ను కొట్టిపారేసిన కేసీఆర్.. ఎగ్జాక్ట్ పోల్స్ కళ్ల ముందు ఉంటాయని చెప్పినట్లు సమాచారం. రెండు రోజులు ప్రశాంతంగా ఉండాలని కేసీఆర్ నేతలకు సూచించారట.

అయితే తెలంగాణలో ఎగ్జిట్‌ పోల్స్ కాంగ్రెస్‌కు మొగ్గు చూపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ కేబినెట్‌ భేటీకి పిలుపునివ్వడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ సంబరాలకు పిలుపునివ్వడం.. మరోవైపు కేసీఆర్‌ కేబినెట్‌ భేటీ పిలుపుతో తెలంగాణ రాజకీయాలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

First Published:  1 Dec 2023 4:04 PM IST
Next Story