భారీ భద్రత మధ్య చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్..
కేసీఆర్ అందరినీ పలకరిస్తూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. బయటకు వచ్చే సమయంలో కూడా ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించారు. వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
సీఎం కేసీఆర్ దంపతులు సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు వేశారు. ఈ గ్రామంలో ఓటు వేయడం సీఎం కేసీఆర్ కి ఓ సెంటిమెంట్. సీఎం దంపతులు చింతమడకకు వస్తున్న సందర్భంలో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.
కేసీఆర్ ఓటు వేసేందుకు రాగా.. మంత్రి హరీష్ రావు ఆయన వెంటే ఉన్నారు. కేసీఆర్ తో పాటు ఆయన కూడా పోలింగ్ బూత్ లోకి వెళ్లారు. కేసీఆర్ ఓటు వేసి తిరిగి వెళ్లే వరకు ఆయనతోనే ఉన్నారు హరీష్ రావు. కేసీఆర్ కు అందరూ నమస్కారం చేస్తూ స్వాగతం పలికారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. మహిళలు ఆయన ఆశీర్వాదం తీసుకోడానికి ముందుకు వచ్చారు.
కేసీఆర్ అందరినీ పలకరిస్తూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. బయటకు వచ్చే సమయంలో కూడా ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించారు. వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కేసీఆర్ రాక సందర్భంగా ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఆయన సమీపంలోకి వచ్చేందుకు దూసుకొస్తున్న వారిని సెక్యూరిటీ నిలువరించారు. అయినా కూడా చాలామంది సీఎం కేసీఆర్ వద్దకు వచ్చే ప్రయత్నం చేశారు.
♦