Telugu Global
Telangana

ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ బంప‌ర్ ఆఫర్

అంగ‌న్‌వాడీలు, ఆశవ‌ర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల్లో చాలా మందిని రెగ్యుల‌రైజ్ చేశాం. మిగతా ఉద్యోగులకు PRC 30శాతం ఇచ్చాం. చిన్న ఉద్యోగుల క‌డుపు నింపాల‌ని 30 శాతం జీతాలు పెంచాం

ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ బంప‌ర్ ఆఫర్
X

ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్. మన ప్రభుత్వం వచ్చాక మళ్లీ మంచి PRC, DAలు ఇచ్చుకుందామన్నారు. దేశం మొత్తంలో అత్యధిక జీతాలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులే అన్న విషయాన్ని గుర్తుచేశారు. మొన్ననే PRP అపాయింట్ చేశాం. మళ్లీ మంచి పీఆర్సీ ఇచ్చుకుందాం.. డీఏలు కూడా బ్రహ్మాండంగా పెంచుకుందామన్నారు. సంగారెడ్డిలో BRS అభ్యర్థి చింతా ప్రభాకర్‌ మద్దతుగా ప్రజా ఆశీర్వాద స‌భ‌లో ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్.

"తెలంగాణ వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు మన వాళ్లకే వస్తయని ఉద్యమ టైమ్‌లోనే చెప్పిన. ఇవాళ చేసి చూపించిన. పేద‌లు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు అంద‌ర్నీ స‌మానంగా చూస్తున్నం. అంగ‌న్‌వాడీలు, ఆశవ‌ర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల్లో చాలా మందిని రెగ్యుల‌రైజ్ చేశాం. మిగతా ఉద్యోగులకు PRC 30శాతం ఇచ్చాం. చిన్న ఉద్యోగుల క‌డుపు నింపాల‌ని 30 శాతం జీతాలు పెంచాం" ఇలా చ‌రిత్రలో ఎక్కడా జ‌ర‌గ‌లేదు, జ‌ర‌గ‌బోదు అన్నారు సీఎం కేసీఆర్.

"మా జాబ్ ఎక్కడ పోతుందోనని ఆర్టీసీ ఉద్యోగులు అనుక్షణం భయపడేవారు. ఇవాళ వాళ్లకు ఏ రందీ లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం. గ‌వ‌ర్నర్ లేట్ చేయ‌డం వ‌ల్ల ఆల‌స్యమైంది. మన గ‌వ‌ర్నమెంట్ రాగానే నెల‌లోపు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తం". ఇలా కులం, మ‌తం అనే తేడా లేకుండా అందర్నీ ముందుకు తీసుకుపోవడమే తన లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్.

First Published:  27 Nov 2023 9:46 PM IST
Next Story