భువనగిరికి వరాలు ప్రకటించిన సీఎం కేసీఆర్..
భువనగిరిలో కాంగ్రెస్ అరాచక శక్తులను పెంచి పోషించిందని, వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏరిపారేసిందని చెప్పారు సీఎం కేసీఆర్. బస్వాపూర్ రిజార్వాయర్ ను త్వరలో తానే స్వయంగా ప్రారంభిస్తానని తెలిపారు.
బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చాక, భువనగిరిలో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణ రాకపోతే భువనగిరి జిల్లా అయిఉండేది కాదన్నారు. ఒకప్పుడు కరవు ప్రాంతమైన భువనగిరిలో ఇప్పుడు పుష్కలంగా పంటలు పండుతున్నాయని గుర్తు చేశారు. మరోసారి బీఆర్ఎస్ ని ఆశీర్వదించాలని, పైళ్ల శేఖర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కేసీఆర్.
భువనగిరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక శక్తులను పెంచి పోషించిందని, వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏరిపారేసిందని చెప్పారు సీఎం కేసీఆర్. బస్వాపూర్ రిజార్వాయర్ ను త్వరలో తానే స్వయంగా ప్రారంభిస్తానని తెలిపారు. మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. తిరిగి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మేనిఫెస్టో అమలులోకి వస్తుందన్నారు.
పొరపాటున కాంగ్రెస్ కి ఓటు వేస్తే మళ్లీ పాత రాజ్యమే వస్తుందని, ప్రజలు, రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తుందన్నారు కేసీఆర్. ధరణి పోర్టల్ రద్దు చేస్తామని కాంగ్రస్ అంటోందని అలాంటి పార్టీని తీసి బంగాళాఖాతంలో పారేయాలన్నారు. ధరణి వల్ల ఎవరి భూములు లాక్కునే పరిస్థితి లేదన్నారు. అందుకే దానిపై కాంగ్రెస్ కి అక్కసు అని చెప్పారు. రైతుల భూమి మీద రైతులకే హక్కు ఉండాలని ధరణి పోర్టల్ తెచ్చామన్నారు. తెలంగాణ వస్తే ధరలు పడిపోతాయని చెప్పారని.. ఇవాళ భూముల ధరలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసన్నారు కేసీఆర్. యాదగిరిగుట్ట దగ్గర పొద్దున ఓరేటు, సాయంత్రమైతే ఓరేటు, రాత్రయితే మరో రేటు ఉందన్నారు. తెలంగాణలో బ్రహ్మాండంగా భూముల రేట్లు పెరుగుతున్నాయని.. భూములేని వారికి న్యాయం జరగాలని బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, సన్నబియ్యం, సౌభాగ్యలక్ష్మిని ప్రకటించామని చెప్పారు కేసీఆర్.