జగన్ అసెంబ్లీ స్పీచ్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలకు తెరలేపిందని, ఎడిటెడ్ వీడియోలను వైరల్ చేస్తోందని మండిపడుతున్నారు. జగన్ స్పీచ్‌కు సంబంధించిన పూర్తి వీడియోను బీఆర్ఎస్ నేతలు సర్క్యులేట్ చేస్తున్నారు.
కృష్ణా జలాల అంశం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కృష్ణా జలాల విషయంలో రెండు పక్షాల పరస్పర విమర్శలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది.
రోజత్త పెట్టిన రాగి సంకటి, నాటు కోడి సుష్టుగ తిని, మనోడు ఒక అడుగు ముందుకేసి నీళ్ళు ఇచ్చాడట..!!
— Geetha Ainala✋ (@GeethaAinalaINC) February 10, 2024
ఆయన మరో మూడడుగులు ముందుకేసి ఆక్రమించాడు...!! సరిపోయింది...!!
ఇపుడు మిస్ అయిన దేశ్ కి నేత సభలు పెట్టి పోరాటం చేస్తాడట @BRSparty
జనం ఒక మాదిరిగా కూడా కనపడటం లేదా..?? pic.twitter.com/SiM4uZnjEw
తాజాగా ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మొదటగా జగన్ మాట్లాడిన ఓ వీడియోను కాంగ్రెస్ హ్యాండిల్స్ వైరల్ చేశాయి. ఆ వీడియోలో నీళ్ల విషయంలో కేసీఆర్ ఉదారత చూపించారని జగన్ చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కృష్ణా జలాలను ఏపీకి అప్పగించారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఈ వీడియోను వైరల్ చేశారు.
తెలంగాణ సమాజమా ,
— Krishank (@Krishank_BRS) February 12, 2024
ఈ రోజు క్రిష్ణా నది ప్రాజెక్టులు కేంద్ర ఆధీనం పై చర్చ అని చెప్పి కాంగ్రెస్ వారు గోదావరి నది ఎడిట్ వీడియో ను అసెంబ్లీ లో చూపిస్తారు.
ఇది పూర్తి వీడియో .. చివరి దాకా చూడండి,
కాంగ్రెస్ మోసాన్ని బహిర్గతం చేయండి pic.twitter.com/Wvn7KD42Qb
అయితే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలకు తెరలేపిందని, ఎడిటెడ్ వీడియోలను వైరల్ చేస్తోందని మండిపడుతున్నారు. జగన్ స్పీచ్‌కు సంబంధించిన పూర్తి వీడియోను బీఆర్ఎస్ నేతలు సర్క్యులేట్ చేస్తున్నారు. గోదావరి నీళ్లను శ్రీశైలం లేదా సాగర్‌కు తరలించి కృష్ణా ఆయకట్టును కాపాడుకుందామని కేసీఆర్ ఉదారత చూపారని జగన్ చెప్పారు. పైన నాసిక్ నుంచి వచ్చే ప్రధాన పాయ నుంచి గోదావరికి నీళ్లు రావట్లేదని.. తెలంగాణలో ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి దాదాపు 50 శాతం గోదావరికి నీటిని తీసుకువస్తున్నాయని జగన్ చెప్పారు. ఇక కృష్ణాపై కర్ణాటక ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు కట్టడంతో నీళ్లు రాలేని పరిస్థితి ఉందని జగన్ అన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం కృష్ణా నీటిని ఏపీకి కేసీఆర్ దోచి పెట్టారన్నట్లుగా ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.