యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి సీఎం శ్రీకారం
రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.
BY Vamshi Kotas21 Oct 2024 6:26 PM IST

X
Vamshi Kotas Updated On: 21 Oct 2024 6:26 PM IST
రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీసుల పిల్లలకు విద్యా అందించేందుకు తెలంగాణ సర్కార్ ఈ స్కూల్‌ను ఏర్పాటు చేస్తోంది. పోలీసులు, ఎక్సైజ్, ఫైర్, ఎస్‌పీఎఫ్ ఉద్యోగుల పిల్లలు ఇక్కడ విద్యనభ్యసించనున్నారు. కాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-5వ తరగతులతో ఈ స్కూల్ ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ.. డిగ్రీ వరకు నాణ్యమైన, అత్యుత్తమ ప్రమాణాలతో పోలీసుల పిల్లలకు విద్యను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story