Telugu Global
Andhra Pradesh

సతీమణి భువనేశ్వరి కోసం బేరం ఆడి చీర కొన్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు అర్ధాంగి భువనేశ్వరి కోసం మార్కాపురంలో బేరం ఆడి చీర కొనుగోలు చేశారు.

సతీమణి భువనేశ్వరి కోసం బేరం ఆడి చీర కొన్న సీఎం చంద్రబాబు
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.డ్వాక్రా మహిళలు తయారుచేసిన వస్తువులను పరిశీలించారు. ఓ చీరల స్టాల్ ను కూడా సందర్శించిన ముఖ్యమంత్రి తన సతీమణి నారా భువనేశ్వరి కోసం ఓ పట్టుచీర కొనుగోలు చేశారు. ఎంతకు అమ్ముతున్నావమ్మా ఈ చీర? అంటూ స్టాల్ లో ఉన్న మహిళను చంద్రబాబు అడిగారు. అందుకు సదరు మహిళ బదులిస్తూ... రూ.26,400 అని చెప్పింది. చివరికి సీఎం ఆ చీరను రూ.25 వేలకు బేరం ఆడి కొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు స్టాల్లో మంగళగిరి పట్టుచీరలు కూడా ఉండడాన్ని ఆసక్తిగా పరిశీలించారు. షర్టు, పంచె, కండువా సెట్ ను కూడా పరిశీలించారు. వ్యాపారం ఎలా సాగుతోందమ్మా? అని ఆరా తీశారు. పర్యావరణ హిత విధానంలో గుడ్డ సంచులు వాడుతుండడం పట్ల ఆ స్టాల్ వారిని చంద్రబాబు అభినందించారు. పోలీసు శాఖ రూపొందించిన ‘శక్తి యాప్‌’ను ప్రారంభించారు. చేనేత రథాన్ని ప్రారంభించడంతో పాటు మహిళా ర్యాపిడో డ్రైవర్లను అభినందించారు. గుర్రపుడెక్క, అరటి, కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీ ద్వారా ఆదాయం లభిస్తుందని సీఎంతెలిపారు. దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు నాణ్యత, బ్రాండింగ్‌ తీసుకురావాలన్నారు. అనంతరం ఈ-వ్యాపారి పోర్టల్‌ డెలివరీని సీఎం ప్రారంభించారు.

First Published:  8 March 2025 2:41 PM IST
Next Story