Telugu Global
Telangana

స్వయంగా టీ తయారు చేసిన సీఎం చంద్రబాబు

శ్రీకాకుళం జిల్లా ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు

స్వయంగా టీ తయారు చేసిన సీఎం చంద్రబాబు
X

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఈదుపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ఓ మహిళకు సిలిండర్ అందజేసి తర్వాత స్వయంగా టీ చేశారు. మహిళ ఇంట్లోకి వెళ్లిన సీఎం స్టవ్ వెలిగించి టీ చేసి తాగారు. టీ తాగినందుకు డబ్బులివ్వాలని, కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని నవ్విస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుకి సూచించారు. ఈ సందర్భంగా లబ్ధిదారు శాంతమ్మ ఆర్థిక, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మరో ఇంట్లోకి వెళ్లి లబ్ధిదారురాలికి పింఛన్‌ను అందజేశారు. ఇంట్లో ఆరోగ్య పరిస్థితిపై వాకాబు చేసి తక్షణమే రెండు లక్షల రూపాయలు అందజేసి ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు, ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాల్లో అందజేశారు. సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పిణీకి శ్రీకారం చుట్టినారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే.. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామంటూ పార్టీ మేనిఫెస్టోలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొందు పరిచారు. ఆ క్రమంలో కూటమి ప్రభుత్వానికి ఓటరు పట్టం కట్టాడు. దాంతో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులోభాగంగా శుక్రవారం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెడ్ల మనోహార్, కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తదితర అధికారులు పాల్గోన్నారు.

First Published:  1 Nov 2024 3:12 PM IST
Next Story