ఎల్‌ఆర్‌ఎస్ అప్లికేషన్లు మార్చి నెలాఖరులోగా క్లియర్ చేయండి
మున్సిపల్ కమిషనర్లకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశం
BY Naveen Kamera9 Jan 2025 8:18 PM IST
X
Naveen Kamera Updated On: 9 Jan 2025 8:18 PM IST
అర్బన్ లోకల్ బాడీస్‌లో వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ అప్లికేషన్లను మార్చినెలాఖరులోగా క్లియర్ చేయాలని అధికారులను ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానాకిషోర్ ఆదేశించారు. గురువారం సీడీఎంఏ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ల రీవ్యూ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీల్లో కొత్త మహిళా స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఎస్‌హెచ్‌జీలకే రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీ ప్లాంట్లు మంజూరు చేయబోతుందని తెలిపారు. దీనికి సంబంధించిన టెండర్లు త్వరలోనే పిలుస్తారని చెప్పారు. ఖాళీ స్థలాలు, రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకులపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో సీడీఎంఏ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
Next Story