బండిసంజయ్ పై రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్ లలో పిర్యాదులు చేసిన 10వ తరగతి విద్యార్థులు
''బండి సంజయ్ రాజకీయ కుతంత్రాలతో పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థి లోకం మానసిక ఆవేదన చెందుతూ పరీక్షలపై ఏకాగ్రత చేయలేకపోతున్నాం. కాబట్టి పేపర్ లీక్ చేసిన బండి సంజయ్, బీజేపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకొని కష్టపడి చదివే విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం'' అని విద్యార్థులు తమ పిర్యాదులో కోరారు.
రాష్ట్రంలో పదవతరగతి ప్రశ్నా పత్రాలను లీక్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై పదవ తరగతి విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు పిర్యాదులు చేశారు. అతనితోపాటు, అతనికి సహకరించినవారిపై కేసులు నమోదు చేయాలని విద్యార్థులు తమ పిర్యాదులో కోరారు.
పదవ తరగతి విద్యార్థుల తరపున 1.ఐలవేని రామ్ తేజ S/0 రమేష్ 2. బైరి తరుణ్ S/0 బైరి శంకర్ లు
మందమర్రి పట్టణ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ మీద ఫిర్యాదు చేశారు
''బండి సంజయ్ రాజకీయ కుతంత్రాలతో పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థి లోకం మానసిక ఆవేదన చెందుతూ పరీక్షలపై ఏకాగ్రత చేయలేకపోతున్నాం. కాబట్టి పేపర్ లీక్ చేసిన బండి సంజయ్, బీజేపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకొని కష్టపడి చదివే విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం'' అని విద్యార్థులు తమ పిర్యాదులో కోరారు.
రాష్ట్రంలో పదవ తరగతి ప్రశ్నా పత్రాలను లీక్ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మారుస్తున్న రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ పై , అతనికి సహకరించిన బీజేపీ కార్యకర్తలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పదవ తరగతి విద్యార్థుల తరపున చెన్నూర్ పోలీస్ స్టేషన్లో పలువురు విద్యార్థులు ఫిర్యాదు చేశారు.జైపూర్ పోలీస్ స్టేషన్లో కూడా పలువురు విద్యార్థులు బండి సంజయ్ పై ఫిర్యాదు చేశారు.