జనసేన సీట్లపై క్లారిటీ.. ఫైనల్ లిస్ట్‌పై బీజేపీ ఫోకస్
జనసేనకు 9 స్థానాలు కేటాయించారు. ఇందులో కూకట్‌పల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూలు, కోదాడ, కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా ఉన్నాయి. మరో రెండు స్థానాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటివరకూ 88 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. రెండు రోజుల్లో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఫైనల్ లిస్టును జాతీయ నాయకత్వం ఆమోదం కోసం పంపనున్నారని సమాచారం.
జనసేనతో పొత్తు కారణంగా మిగిలిన 31 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది. అయితే శనివారం రాత్రి రెండు పార్టీల మధ్య సీట్ల పంపిణీపై క్లారిటీ రావడంతో అభ్యర్థుల ఎంపికపై కమలనాథులు దృష్టిసారించారు. 22 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ఫైనల్ చేయనుంది.
ఇక జనసేనకు 9 స్థానాలు కేటాయించారు. ఇందులో కూకట్‌పల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూలు, కోదాడ, కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా ఉన్నాయి. మరో రెండు స్థానాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక బీజేపీ పెండింగ్ జాబితాలో శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, గద్వాల్, వేములవాడ, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మిర్యాలగూడ, ములుగు స్థానాలున్నాయి. రెండు, మూడు స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. వేములవాడలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు, ఉమ్మడి కరీంనగర్ మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ తుల ఉమా మధ్య పోటీ నెలకొంది. ఇక శేరిలింగంపల్లి నుంచి రవి కుమార్ యాదవ్ పోటీలో ఉండనున్నారు.