జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలింపు
లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో గోవాలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్న నార్సింగ్ పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అనంతరం రాజేంద్రనగర్ సీసీఎస్ కార్యాలయంలో సీక్రెట్‌గా విచారించారు. కాగా తాను మైనర్‌గా సమయంలో ముంబై హోటల్లో జానీ తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. షూటింగ్ టైంలో క్యారవాన్‌లో బలవంతం చేశాడు. శారీరక కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడు. తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడు.
పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ తనపై ఒత్తిడి చేశాడని బాధితురాలు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. పోలీసుల విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ.. నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు. కావాలనే కొందరు నాపై ఫిర్యాదు చేయించారు. న్యాయపరంగా పోరాడి నిజాయితీగా బయటకు వస్తా. నన్ను ఇరికించినవాళ్లను వదిలిపెట్టనని హెచ్చరించాడు. ఈ సందర్భంగా కోర్టు జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో అక్టోబర్ 3 వరకూ కొరియోగ్రఫర్ రిమాండ్‌లోనే ఉండనున్నారు.మరోవైపు ఆయన బెయిల్ కోసం రంగారెడ్డి కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.