Telugu Global
Telangana

చిట్టినాయుడు.. నువ్వా.. కేసీఆర్‌ పేరు తుడిచేది?

కేసీఆర్‌ను మరిచిపోయేలా చేశానన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌

చిట్టినాయుడు.. నువ్వా.. కేసీఆర్‌ పేరు తుడిచేది?
X

రాజకీయంగా ఏడాదిలో కేసీఆర్‌ ఉనికి లేకుండా చేస్తాన్న సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్‌పై సెటైర్లు వేశారు."పదవుల కోసం రేవంత్‌ పరితపిస్తున్నప్పుడు కేసీఆర్‌ ఉన్న పదవే వదిలేశారు. ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టినప్పుడు కేసీఆర్‌ ప్రాణాన్నే పణంగా పెట్టారు. తెలంగాణను చంపేందుకు రేవంత్‌ బ్యాగులు మోశారు. రేవంత్‌ బ్యాగులు మోస్తున్నప్పుడు కేసీఆర్‌ రాష్ట్ర భవిష్యత్తుకు ఊపిరిపోశారు.కేసీఆర్‌ అంటేనే తెలంగాణ చరిత్ర. చిట్టినాయుడు.. నువ్వా.. కేసీఆర్‌ పేరు తుడిచేది?" అని కేటీఆర్‌ మండిపడ్డారు.

మూసీపై ముందుకు.. కొనుగోళ్లపై వెనక్కు అని కేటీఆర్‌ విమర్శించారు. 'రామన్నపేటకు రైరై.. కొనుగోలు సెంటర్లకు నైనై. రామగుండం ధనాధన్‌.. ధాన్యం కొనుగోళ్లు డాండాం. కొనుగోళ్లకు దిక్కులేదు. కాంగ్రెస్‌ కోతలకు లెక్కలేదు. దళారులకు దండిగా.. రైతన్నలకు దండగా. ఎద్దేడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పడూ బాగుపడదు' అని 'ఎక్స్‌'లో రాసుకొచ్చారు.

First Published:  30 Oct 2024 11:47 AM IST
Next Story