Telugu Global
Telangana

వ్యవసాయ వ్యవహారాల సలహాదారునిగా చెన్నమనేని.. ఐదేళ్ల పాటు కేబినెట్ హోదా

ఆయనకు వ్యవసాయ రంగంలో ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు సలహాదారు పదవిని కట్టబెట్టారు.

వ్యవసాయ వ్యవహారాల సలహాదారునిగా చెన్నమనేని.. ఐదేళ్ల పాటు కేబినెట్ హోదా
X

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్ బాబును కీలక పదవి వరించింది. అగ్రికల్చర్ ఎకానమీలో అపార అనుభవం ఉన్న రమేశ్ బాబును రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల సలహాదారునిగా నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో ఆయన ఐదేళ్ల పాటు సేవలు అందించనున్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేనికి పలు కారణాల వల్ల టికెట్ నిరాకరించారు. కానీ, ఆయనకు వ్యవసాయ రంగంలో ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు సలహాదారు పదవిని కట్టబెట్టారు. చెన్నమనేని రమేశ్ బాబు జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మక 'హంబోల్డ్ యూనివర్సిటీ' నుంచి 'అగ్రికల్చర్ ఎకానమిక్స్'లో పరిశోధనలు చేసి పీహెచ్‌డీ పట్టా పొందారు. వినూత్న వ్యవసాయ పథకాలు, పుష్కలమైన సాగునీరు, 24 గంటల విద్యుత్ సరఫరా కారణంగా తెలంగాణ ఇప్పుడు వ్యవసాయ రంగంలో దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకుంటోంది.

ఈ నేపథ్యంలో పరిశోధనా విద్యార్థిగా, ప్రొఫెసర్‌గా చెన్నమనేనికి వ్యవసాయ ఆర్థిక రంగంపై ఉన్న అపారమైన అనుభవాన్ని వినియోగించుకోనున్నారు. విస్తృతమైన జ్ఞానాన్ని రాష్ట్ర రైతాంగం, వ్యవసాయాభివృద్ధి కోసం వాడుకోనున్నారు. అందుకే సీఎం కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రమేశ్ బాబుకు సలహాదారు పదవి కట్టబెట్టనున్నట్లు సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.

*

First Published:  26 Aug 2023 6:09 AM IST
Next Story