రేవంత్‌కు చంద్రబాబు రిక్వెస్ట్.. విషయం ఏంటంటే?
చంద్రబాబు లేఖ పట్ల సానుకూలంగా స్పందించారు రేవంత్ రెడ్డి. ప్రజాభవన్‌లో ఈ సమావేశం జరుగుతుందని సమాచారం. చంద్రబాబు, రేవంత్ భేటీ ఇదే తొలిసారి కానుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని రేవంత్‌ను లేఖలో కోరారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా కొన్ని సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు.
పరస్పర సహకారం.. తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని లేఖలో తెలిపారు చంద్రబాబు. ఈనెల 6న హైదరాబాద్ వస్తానని, సమస్యలపై ముఖాముఖి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు లేఖలో ప్రతిపాదించారు. ఉమ్మడి అంశాల సామరస్య పరిష్కారానికి ఎదురు చూస్తున్నట్లు చంద్రబాబు లేఖలో వెల్లడించారు.
చంద్రబాబు లేఖ పట్ల సానుకూలంగా స్పందించారు రేవంత్ రెడ్డి. ప్రజాభవన్‌లో ఈ సమావేశం జరుగుతుందని సమాచారం. చంద్రబాబు, రేవంత్ భేటీ ఇదే తొలిసారి కానుంది. గతంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. ఇటీవల చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అందినప్పటికీ రేవంత్ హాజరుకాలేదు. ఇక జూలై 21-22న హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ కమ్మ మహాసభలకు ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.