కేసీఆర్‌కు చంద్రబాబు పరామర్శ
కేసీఆర్ తొందరగా కోలుకుని, ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌తో మాట్లాడాలనిపించి వచ్చానన్నారు. కేసీఆర్ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి 6 వారాల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారన్నారు.
సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్ తొందరగా కోలుకుని, ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌తో మాట్లాడాలనిపించి వచ్చానన్నారు. కేసీఆర్ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి 6 వారాల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారన్నారు. అప్పుడప్పుడు కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతుంటాయన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసిన టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. pic.twitter.com/MJQ4cPkn5n
— Telugu Scribe (@TeluguScribe) December 11, 2023
అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఎస్పీ స్టేట్ చీఫ్ RS ప్రవీణ్ కుమార్ కేసీఆర్‌ను పరామర్శించి.. క్షేమ సమాచారం తెలుసుకున్నారు. గురువారం రాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో జారిపడటంతో కేసీఆర్ ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ కోలుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.