చంద్రబాబు, మోడీ పొత్తు.. రేవంత్ రియాక్షన్ ఇదే..!
400 సీట్లు బీజేపీకి వస్తే ఏపీలో చంద్రబాబు, ఒడిశాలో నవీన్ పట్నాయక్‌తో పొత్తులెందుకన్నారు రేవంత్ రెడ్డి. మోడీ సంసారం సక్కగుంటే.. ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరితో పొత్తులు ఎందుకు పెట్టుకుంటారని ప్రశ్నించారు రేవంత్.
రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కూటమిగా ఏర్పడటంపై స్పందించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మోడీ 400 సీట్లు వస్తాయని చెప్తున్నారని.. మరీ అలాంటి పరిస్థితే ఉంటే పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. మేడ్చల్‌లో నిర్వహించిన ప్రజా దీవెన సభలో ఈ కామెంట్స్ చేశారు రేవంత్.
Terming NDA as “Patchwork” (అతుకులబొంత), #Telangana CM A Revanth Reddy questioned Narendra Modi why he needs Chandrababu Naidu or Navin Patnaik if they are getting 400seats.
— Naveena (@TheNaveena) March 9, 2024
Rs50 quarter bottle liquor became Rs200 because of Modi and KCR
They said Vajpayee Shining India- in… pic.twitter.com/ahpuJ571rF
400 సీట్లు బీజేపీకి వస్తే ఏపీలో చంద్రబాబు, ఒడిశాలో నవీన్ పట్నాయక్‌తో పొత్తులెందుకన్నారు రేవంత్ రెడ్డి. మోడీ సంసారం సక్కగుంటే.. ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరితో పొత్తులు ఎందుకు పెట్టుకుంటారని ప్రశ్నించారు రేవంత్. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను చీల్చారని.. కర్ణాటకలో దేవెగౌడతో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. బిహార్‌లో నితీశ్‌కుమార్, యూపీలో అప్నాదళ్‌తో బీజేపీ పొత్తులు పెట్టుకుందని.. ఎన్డీఏ మొత్తం అతుకులబొంతలా మారిందన్నారు రేవంత్.
400 సీట్లు గెలిచే సత్తా బీజేపీకి ఉంటే.. ఈ అతుకులబొంత ఎందుకని ప్రశ్నించారు. ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే మోడీ ప్రతి రాష్ట్రంలో పొత్తులు పెట్టుకుంటున్నారన్నారు. బీజేపీకి కాలం చెల్లిందని.. రాష్ట్రంలో కేడీని బండకేసి కొట్టారని.. త్వరలోనే కేంద్రంలో మోడీని బండకేసి కొట్టాడానికి 140 కోట్ల మంది సిద్ధంగా ఉన్నారంటూ కామెంట్స్ చేశారు రేవంత్.