Telugu Global
Telangana

చంచల్‌గూడ డబుల్‌ బెడ్‌రూమ్.. ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత

చంచల్‌గూడ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ కోసం నిర్మించిన ఇళ్లను మూసీ నిర్వహితులకు ఎలా ఇస్తారంటూ స్థానికులు నిరసన చేపట్టారు.

చంచల్‌గూడ డబుల్‌ బెడ్‌రూమ్.. ఇళ్ల వద్ద  తీవ్ర ఉద్రిక్తత
X

హైదరాబాద్ చంచల్‌గూడ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ కోసం నిర్మించిన ఇళ్లను మూసీ నిర్వహితులకు ఎలా ఇస్తారంటూ స్థానికులు నిరసన చేపట్టారు. చంచల్‌గూడ పరిధిలో ఇళ్లు లేని నిరుపేదలు చాలా ఉన్నారని.. డబుల్ బెడ్‌రూమ్స్‌ను కేవలం స్థానికులకే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున స్థానికులు అక్కడకు చేరుకుని నిరసన తెలుపుతుండగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట నెలకొంది.

ఈ ఘటనలో పులువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. మూసీ సుందరీకరణలో భాగంగా రేవంత్ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఎఫ్‌టీఎల్ , బఫర్ జోన్ల పరిధిలో ఉన్న ఆక్రమణలను కూల్చివేస్తోంది. అయితే, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూంలు కేటాయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా కొందరిని ఇప్పటికే స్థానికంగా ఉన్న డబుల్ బెడ్‌రూం సముదాయాల్లోకి తరలిస్తున్నారు. మరికొందరు నిర్వాసితులను ఇతర ప్రాంతాల్లో ఉన్న డబుల్ బెడ్‌రూం నివాసంలో పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

First Published:  30 Sept 2024 4:53 AM GMT
Next Story