Telugu Global
Telangana

మహిళా, శిశు పోషకాహారం విషయంలో కూడా తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష‌

2016-17 నుండి, గత ఏడేళ్లలో, సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.58,247.03 కోట్లను మంజూరు చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఈ కార్యక్రమం కింద భారీగా నిధులు అందుతుండగా, తెలంగాణకు వాటితో పోలిస్తే చాలా తక్కువ నిధులు వచ్చాయి.

మహిళా, శిశు పోషకాహారం విషయంలో కూడా తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష‌
X

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షకు అ‍తులేకుండా పోతోంది. చివరకు ఇప్పుడు మహిళా, శిశు పోషకాహార కార్యక్రమం కింద బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా తెలంగాణకు అతితక్కువ నిధుల కేటాయించింది.

2016-17 నుండి, గత ఏడేళ్లలో, సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.58,247.03 కోట్లను మంజూరు చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఈ కార్యక్రమం కింద భారీగా నిధులు అందుతుండగా, తెలంగాణకు వాటితో పోలిస్తే చాలా తక్కువ నిధులు వచ్చాయి.

2022-23లో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం కింద గుజరాత్‌కు రూ.252.53 కోట్లు,మధ్యప్రదేశ్‌కు రూ.186.01 కోట్లు విడుదల చేయగా, తెలంగాణకు రూ.165.21 కోట్లు వచ్చాయి. అలాగే, గత ఆర్థిక సంవత్సరంలో కూడా బిజెపి పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు చాలా తక్కువ నిధులు వచ్చాయి. 2021-22లో గుజరాత్‌కు రూ.505.26 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.553.38 కోట్లు, కర్ణాటకకు రూ.581.02 కోట్లు, తెలంగాణకు రూ.246.80 కోట్లు మాత్రమే వచ్చాయి.

సంగన్న అమరప్ప, జై సిద్దేశ్వర శివాచార్య మహాస్వామీజీ,డాక్టర్ ఉమేష్ జి. జాదవ్‌లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖా మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో ఈ వివరాలను వెల్లడించారు.

అంగన్‌వాడీ పథకం కింద, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 లో పేర్కొన్న పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బిడ్డకు ఆరు నెలల వయస్సు వచ్చే వరకు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు పోషకాహారంతో సహా సేవల ప్యాకేజీ అందించబడుతుంది. అంగన్‌వాడీ కేంద్రాలలో, గర్భిణీ స్త్రీలకు కనీసం 100 రోజుల పాటు న్యూట్రీషన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి..

ఆరోగ్యకరమైన సమాజం తయారవడం కోసం శిశువులకు పోషకాహారం అవసరమని WHO సహా అనేక అంతర్జాతీయ, జాతీయ సంస్థలు చెప్తున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో కూడా వివక్ష చూపించడం పట్ల ఆందోళన వ్యక్తంఅవుతోంది.

First Published:  6 Feb 2023 1:36 AM GMT
Next Story