Telugu Global
Telangana

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ ప్రాజెక్టు నివేదికను తిరస్కరించిన కేంద్రం

మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి నిర్మించతలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటి వరకు పట్టించుకోని కేంద్ర జలసంఘం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తిరస్కరించింది.

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ ప్రాజెక్టు నివేదికను తిరస్కరించిన కేంద్రం
X

కేంద్ర బీజేపీ సర్కార్ తెలంగాణ పట్ల వివక్ష‌ చూపుతోందని, తమ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నదని బీఆరెస్ ప్రభుత్వం, పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రం మరో నిర్ణయం కలక‌లం సృష్టిస్తోంది.

మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి నిర్మించతలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. అనేక సార్లు కేంద్ర జలసంఘానికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లేఖలు రాశారు. అయినప్పటికీ ఇప్పటి వరకు పట్టించుకోని కేంద్ర జలసంఘం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తిరస్కరించింది.

ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ పలు అభ్యంతరాలను లేవనెత్తిన నేపథ్యంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)లోని ప్రాజెక్ట్ అప్రైజల్ డైరెక్టరేట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్2 (KWDT-2) తీర్పు ఇచ్చే వరకు డీపీఆర్‌ను పరిశీలనకు తీసుకోలేమని స్పష్టం చేసింది.

ఈ మేరకు సిడబ్ల్యుసి ప్రాజెక్ట్ డైరెక్టరేట్ సీనియర్ అధికారి నిత్యానంద ముఖేజీ తెలంగాణ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ కు లేఖ రాశారు.

KWDT-2 లో కొనసాగుతున్న ప్రక్రియకు ముందు కృష్ణాకు గోదావరి నీటి మళ్లింపు అంశం తేలాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసిందని చెప్పారు. .

“ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ప్రాజెక్టుల వారీ కేటాయింపులకు సంబంధించిన సమస్యలను ట్రిబ్యునల్ మొదటిసారిగా స్వీకరించినందున, అది తేలే వరకు పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (PRLIS)కు ఆమోద ముద్ర వేయడం సాధ్యం కాదని CWC భావిస్తోంది. ,” అని ముఖేజీ తెలిపారు.

First Published:  15 April 2023 1:01 PM IST
Next Story