డీజీపీ అంజనీకుమార్‌కు ఈసీ షాక్..!
కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించగానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు డీజీపీ అంజనీ కుమార్, ఇద్దరు అదనపు డీజీలు. రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించి విషెస్ తెలిపారు.
BY Telugu Global3 Dec 2023 7:00 PM IST
![డీజీపీ అంజనీకుమార్‌కు ఈసీ షాక్..! డీజీపీ అంజనీకుమార్‌కు ఈసీ షాక్..!](https://www.teluguglobal.com/h-upload/2023/12/03/866143-central-election-commission-suspended-telangana-dgp-anjani-kumar.webp)
X
Telugu Global Updated On: 3 Dec 2023 7:00 PM IST
తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ సస్పెన్షన్‌కు గురయ్యారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఇక ఇద్దరు అదనపు డీజీలు సందీప్ కుమార్ జైన్, మహేష్ భగవత్‌కు నోటీసులు జారీచేసింది.
కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించగానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు డీజీపీ అంజనీ కుమార్, ఇద్దరు అదనపు డీజీలు. రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించి విషెస్ తెలిపారు. రేవంత్‌కు భద్రత కల్పించే అంశంపై చర్చించారు.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం డీజీపీని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అర్హత ఉన్న సీనియర్ పోలీస్ అధికారిని డీజీపీగా నియమించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద వేటు వేసింది.
Next Story