Telugu Global
Telangana

మెట్రో ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది : మంత్రి కేటీఆర్

బెంగళూరు, చెన్నై, కొచ్చి, గాంధీనగర్‌లో పాటు యూపీలో తక్కువ జనాభా ఉన్న లక్నో, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, మీరట్ వంటి పట్టణాలకు కేంద్రం మెట్రో ప్రాజెక్టులు కేటాయించింది. కానీ హైదరాబాద్‌కు మాత్రం నిధులు ఇవ్వబోమని చెప్పేసిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

మెట్రో ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది : మంత్రి కేటీఆర్
X

హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశకు నిధులు కావాలని కోరినా కేంద్రం ఇవ్వలేదని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు లాభసాటి కాదని కేంద్రం సాకులు చెబుతోందని ఆయన అన్నారు. ఇక్కడ ట్రాఫిక్ లేదని, రెండో దశ మెట్రో కట్టినా పెద్దగా లాభాలు రావని అంటున్నారు. పట్టుమని 10 లక్షల జనాభా కూడా లేని మీరట్, కాన్పూర్ పట్టణాలకు మెట్రో తీసుకొని వస్తున్నారు. కానీ, హైదరాబాద్‌లో రెండో దశ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే.. కేంద్రం చెప్పిన అబద్దాలు ఇవని మంత్రి వెల్లడించారు.

బెంగళూరు, చెన్నై, కొచ్చి, గాంధీనగర్‌లో పాటు యూపీలో తక్కువ జనాభా ఉన్న లక్నో, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, మీరట్ వంటి పట్టణాలకు కేంద్రం మెట్రో ప్రాజెక్టులు కేటాయించింది. కానీ హైదరాబాద్‌కు మాత్రం నిధులు ఇవ్వబోమని చెప్పేసిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరికి మంగళవారం మెట్రో రెండో దశ కోసం లేఖ రాయగా.. కేంద్రం ఇలా జవాబిచ్చింది.

మెట్రో రెండో దశ కోసం అన్ని వివరాలతో కూడిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు అందించామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఉన్న రద్దీ, పీహెచ్‌డీటీ గణాంకాలు, ఇతర అర్హతలు, సానుకూలతలను అనేక సార్లు కేంద్రం దృష్టికి తీసుకొని వెళ్లాము. తెలంగాణ మున్సిపల్ శాఖ కూడా కేంద్రానికి అవసరమైన సమాచారం మొత్తం పింపింది. ఇలా వాళ్లు ఏమి అడిగినా ఇచ్చాము. కానీ మెట్రో ఇక్కడ ఫిజిబిలటీ కాదని చెప్తున్నారు. అందుకే.. మరింత సమాచారాన్ని జోడించి మళ్లీ లేఖ రాసినట్లు కేటీఆర్ చెప్పారు.

కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ను కలిసి వ్యక్తిగతంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ గురించి వివరించాలని, దానికి ఉన్న ప్రాధాన్యతను చెప్పాలని ప్రయత్నించాను. కానీ ఇప్పటి వరకు ఆయన కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదని మంత్రి చెప్పారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానున. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేయాలని మంత్రి కోరారు. అనేక రాష్ట్రాలు, పట్టణాలకు ప్రాజెక్టులు కట్టబెడుతూ ఇలా తెలంగాణపై వివక్ష చూపడం తగదని మంత్రి అన్నారు.

First Published:  29 March 2023 9:54 AM IST
Next Story