యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టుకు లోన్లు రాకుండా కేంద్రం అడ్డుకున్నది -కేటీఆర్
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్దిని కేంద్ర అడుగడుగునా అడ్డుకుంటోందని మండిపడ్డారు. యాదాద్రి విద్యుత్ ప్లాంట్ కు లోన్లు ఇవ్వడానికి పలు ఆర్థిక సంస్థలు ముందుకు వస్తే వాటిని బెదిరించారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా మిరియాల గూడలో యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మించడానికి రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ ప్రాజెక్టుకు ఆర్థిక సంస్థలు లోన్లు ఇవ్వకుండా కేంద్రం బెదిరించిందని కేటీఆర్ ఆరోపించారు.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్దిని కేంద్ర అడుగడుగునా అడ్డుకుంటోందని మండిపడ్డారు. యాదాద్రి విద్యుత్ ప్లాంట్ కు లోన్లు ఇవ్వడానికి పలు ఆర్థిక సంస్థలు ముందుకు వస్తే వాటిని బెదిరించారని ఆరోపించారు.
ఆ ప్రాజెక్టు కాంట్రాక్ట్ BHEL కు ఇచ్చామని, చివరకు బీహెచ్ ఎల్ అధికారులు కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండేకు మొరపెట్టుకుంటే వారి వత్తిడితో ఆ మంత్రి చొరవ తీసుకుంటే తప్ప బెదిరింపులు ఆగిపోలేదని కేటీఆర్ చెప్పారు.
విభజన హామీలను మోడీ సర్కార్ ఇప్పటికీ పట్టించుకోవడం లేదని, అసలు తెలంగాణ పదం అంటేనే ఆయనకు ఎందుకు కోపమని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం గురించి ప్రపంచంలోని నిపుణులంతా గొప్పగా చెప్తూ ఉంటే మోడీకి కానీ, ఇక్కడున్న బీజేపీ నాయకులకు కానీ ఎందుకు పట్టదన్నారు కేటీఆర్.
తెలంగాణలో తాము రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తూ ఉంటే కేంద్రం సహించలేకపోతోందని, అందుకే మోటర్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని కేటీఆర్ తెలిపారు. కేంద్ర రాసిన లేఖను అసెంబ్లీలో అందరికీ చూపించిన కేటీఆర్ అనుమానముంటే ఆ కాపీని సభ్యులందరికీ పంపిస్తానని చెప్పారు.
బడ్జెట్ లో పక్కనున్న కర్నాటకకు 5, 300 కోట్ల నిధులు కేటాయించిన కేంద్రం తెలంగాణకు మొండిచేయి చూపెట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. ఎవరు సహాయం చేయకపోయినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ఆరోపణలు చేసినా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే మొదటి స్థానం సాధించి తీరుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.