కామారెడ్డిలో మొదలైన సంబరాలు..
బీఆర్‌ఎస్ కే ఓటు వేస్తామంటూ ఏకగ్రీవ తీర్మానం చేసి, ఆ కాపీని స్థానిక సర్పంచ్ లకు అందజేశారు. కేసీఆర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, ఆయనను భారీ మెజారిటీతో గెలిపించి గౌరవించుకుంటామని అంటున్నారు ప్రజలు.
ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, ప్రచారం మొదలు కాలేదు, ఎన్నికలు జరగలేదు, రిజల్ట్ రాలేదు. కానీ కామారెడ్డిలో అప్పుడే ఫలితాలు వచ్చేసినంత సందడి కనపడుతోంది. ఊరూవాడా బీఆర్ఎస్ విజయోత్సవ ర్యాలీలు జరుగుతున్నాయి.
గజ్వేల్ తోపాటు ఈ దఫా కామారెడ్డిలో కూడా పోటీకి సిద్ధమయ్యారు సీఎం కేసీఆర్. కేసీఆర్ రెండు నియోజకవర్గాల స్ట్రాటజీతో ప్రతిపక్షాలు డైలమాలో పడ్డాయి. అదే సమయంలో ఆ రెండు నియోజకవర్గాల్లో పండగ వాతావరణం నెలకొంది. గజ్వేల్ సంగతి పక్కనపెడితే కామారెడ్డి ప్రజలు కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడే అక్కడ సంబరాలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ కి మద్దతుగా గ్రామాల్లో ర్యాలీలు మొదలయ్యాయి. ఆయనకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ గ్రామాలు తీర్మానాలు చేస్తున్నాయి. ఆ తీర్మానాల కాపీలను గ్రామ సర్పంచ్ లకు అందజేస్తున్నారు ప్రజలు.
మా అందరి మద్దతు కేసీఆర్ కే..
కేసీఆర్ ప్రచారానికి రాకపోయినా పర్లేదు, మా మద్దతు ఆయనకేనంటూ గ్రామాలన్నీ ఏకమవుతున్నాయి. కేసీఆర్ పాలనలో తమకు కలిగిన లబ్ధిని వారు గుర్తు చేసుకుంటున్నారు. కేవలం తమకు, తమ కుటుంబాలకే కాకుండా, తమ గ్రామాలు, మండలాలకు తెలంగాణ ఏర్పాటయ్యాక కలిగిన లబ్ధిని వారు ప్రస్తావిస్తున్నారు. పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి తమ అభిమానం చాటుకుంటున్నారు.
కేసీఆర్ తో మరింత అభివృద్ధి..
కామారెడ్డి, మాచారెడ్డి, బీబీపేట, దోమకొండ, రామారెడ్డి, భిక్కనూర్ మండలాల్లో వివిధ సామాజికవర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీ చేపట్టారు. కేసీఆర్ తోపాటు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బీఆర్‌ఎస్ కే ఓటు వేస్తామంటూ ఏకగ్రీవ తీర్మానం చేసి, ఆ కాపీని స్థానిక సర్పంచ్‌కు అందజేశారు. కేసీఆర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, ఆయనను భారీ మెజారిటీతో గెలిపించి గౌరవించుకుంటామని అంటున్నారు ప్రజలు.
♦