Telugu Global
Telangana

టీటీడీ లడ్డూ నాణ్యతపై సీబీఐతో విచారణ చేయించాలి : వైఎస్ షర్మిల

శ్రీవారి కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ చేయించాలని కోరారు.

టీటీడీ లడ్డూ నాణ్యతపై సీబీఐతో విచారణ చేయించాలి :  వైఎస్ షర్మిల
X

తిరుమల లడ్డూ నాణ్యతపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. శ్రీవారి లడ్డూ కల్తీపై సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. టీటీడీ లడ్డూ వివాదాన్ని రాజకీయంగా వాడుకోవడం మంచిది కాదన్నారు. కొనుగోలు చేసిన నెయ్యి ధర నైవేద్యానికి రూ. 1,600, లడ్డూ తయారీకి మాత్రం రూ. 320 మాత్రమే ఖర్చు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రూ. 320 నెయ్యికి టెండర్ ఎలా ఖరారు చేశారని షర్మిల ప్రశ్నించారు. వారు సరఫరా చేస్తున్నది నూనె, నెయ్యి, క్రూడ్ ఆయిలా అనే ఇంగితం కూడా లేకుండా సరఫరాకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.

అసలు తప్పంతా ఇక్కడే జరిగిందని అర్థమవుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న సరఫరాదారులు ఇచ్చిన శాంపిల్స్‌లో తప్పు జరిగినట్లు తేలిందన్నారు. జులై 23న ఈ విషయం వెలుగులోకి వస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు నెలల పాటు ప్రజలకు ఎందుకు చెప్పలేదని షర్మిల ప్రశ్నించారు. ఇది భక్తికి సంబంధించిన విషయం అని.. రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వ పరంగా ఏ విచారణ జరిగినా అందులో రాజకీయ కోణం ఉంటుందని.. అందుకే గవర్నర్‌ను కలిసి సీబీఐ విచారణ చేయించాలని కోరామని షర్మిల అన్నారు

First Published:  21 Sept 2024 3:55 PM GMT
Next Story