రేవంత్ వార్నింగ్.. నవనీత్‌కౌర్‌పై కేసు
సీఎం రేవంత్ రెడ్డి సైతం నవనీత్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. నవనీత్‌కౌర్ వ్యాఖ్యలు మతకల్లోలాలకు దారితీస్తాయన్నారు. ఆమెను వెంటనే బీజేపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు
బీజేపీ ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్‌కు బిగ్ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది. ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా షాద్‌నగర్‌లో ప్రచారం చేశారు నవనీత్‌కౌర్. రోడ్ షోలో పాల్గొన్న ఆమె.. కాంగ్రెస్‌కు ఓటేస్తే, పాకిస్తాన్‌కు వేసినట్టే అన్నారు. నవనీత్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.
నవనీత్ వ్యాఖ్యలపై ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో షాద్‌నగర్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం నవనీత్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. నవనీత్‌కౌర్ వ్యాఖ్యలు మతకల్లోలాలకు దారితీస్తాయన్నారు.
ఆమెను వెంటనే బీజేపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇక్కడున్న మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈసీ కూడా సుమోటోగా చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.