హిందీ మహావిద్యాలయ అనుమతులు రద్దు
స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలని యూజీసీ ఉస్మానియా యూనివర్సిటీ సిఫార్సు
BY Naveen Kamera23 Nov 2024 5:16 PM IST
X
Naveen Kamera Updated On: 23 Nov 2024 5:16 PM IST
హైదరాబాద్ లోని హిందీ మహావిద్యాలయ అనుమతులను ఉస్మానియా యూనివర్సిటీ రద్దు చేసింది. పరీక్షల నిర్వహణ, విద్యార్థుల మార్కుల జాబితాల్లో అక్రమాలు జరిగినట్టుగా గుర్తించింది. సంస్థపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన కమిటీ సిఫార్సుల మేరకు చర్యలు చేపట్టింది. హిందీ మహావిద్యాలయ నిర్వాహకులు ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్టుగా కమిటీ విచారణలో తేలింది. అలాగే హిందీ మహావిద్యాలయ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలని కోరుతూ యూజీసీకి సిఫార్సు చేసింది. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల కోర్సులు పూర్తి చేసేందుకు అవకాశమిస్తామని, కొత్తగా అడ్మిషన్లు చేపట్టడానికి వీల్లేదని ఓయూ అధికారులు తేల్చిచెప్పారు.
Next Story