ఇండియాలో BYD పెట్టుబడి..కేంద్రానికి కేటీఆర్ ప్రశ్నలు
ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల కంపెనీలో ఒకటైన చైనీస్ ఆటోమోటివ్ BYD (బిల్డ్ యువర్ డ్రిమ్స్) ఇండియాలో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు సమాచారం.
ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల కంపెనీలో ఒకటైన చైనీస్ ఆటోమోటివ్ BYD (బిల్డ్ యువర్ డ్రిమ్స్) ఇండియాలో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు సమాచారం. ఇండియాలో దాదాపు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు BYD ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పెట్టుబడిలో భాగంగా ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు తయారు చేయాలని BYD లక్ష్యంగా పెట్టుకున్నట్లు పారిశ్రామిక వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్‌తో BYD భాగస్వామ్యం కలిగి ఉంది. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తో పాటు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెహికిల్స్ తయారీలో BYD ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది.
ఐతే BYD ఇండియాలో పెట్టుబడులు పెట్టనుందన్న వార్తలపై స్పందించారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏడాది క్రితం BYD బిలియన్ డాలర్ల పెట్టుబడితో తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకుందని, కానీ ఆ ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం తిరస్కరించిందని గుర్తు చేశారు కేటీఆర్. ఈ పెట్టుబడి ద్వారా వేలాది ఉద్యోగాల కల్పనతో పాటు దేశంలో ఎలక్ట్రానిక్ వెహికిల్ వ్యవస్థకు మరింత ఊతం ఇచ్చినట్లు ఉంటుందన్నారు. ఐతే గతంలో BYD పెట్టుబడులను నిరాకరించిన కేంద్రం ఇప్పుడు ఓకే చెప్పిందని..అప్పటికీ, ఇప్పటికి పరిస్థితుల్లో ఏ మార్పు వచ్చిందో చెప్పాలని కేంద్రానికి ప్రశ్నలు సంధించారు కేటీఆర్. ఈ విషయంపై కేంద్రం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సరిహద్దులో గాల్వాన్‌లోయలో ఉద్రిక్తతల కారణంగా ఆటోమోటివ్ రంగంలో చైనా పెట్టుబడులను గతంలో కేంద్రం తిరస్కరించింది. చైనా నుంచి పెట్టుబడులు తగ్గించేలా నిర్ణయాలు తీసుకుంది. ఆ టైంలో MG(మొర్రిస్ గ్యారెజెస్) సైతం తన మెజార్టీ వాటాలను ఇండియన్ కంపెనీకి అమ్మేందుకు ప్రయత్నాలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం BYD థర్డ్ ప్లేసులో ఉంది. మొదటి స్థానంలో టెస్లా, రెండో స్థానంలో టయోటా ఉన్నాయి.
Over a year ago when Chinese Automaker BYD wanted to setup a Billion Dollar Factory in Telangana, the Union Government rejected the proposal
— KTR (@KTRBRS) August 29, 2024
The investment could have created thousands of jobs & revved up the nascent EV ecosystem in our country
Now, we are hearing news that… pic.twitter.com/CxsFriXget