చెన్నూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయం : బాల్క సుమన్
తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరల్లో ఈడీ కేసులో గడ్డం వివేక్ జైలు పోవటం పక్కా అని సుమన్ తెలిపారు.
చెన్నూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూటుకేస్ కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ జైలు పోవటం తథ్యమని సుమన్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివేక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని.. రేవంత్ కాదు కదా.. భగవంతుడు కూడా వివేక్‌ను కాపాడలేరన్నారు. ఈడీ కేసు జరుగుతుంటే.. తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహించారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తోన్న పోలీసులు భవిష్యత్తులో బలికాక తప్పదని సుమన్ వార్నింగ్ ఇచ్చారు.వివేక్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు వరకు వెళ్తామని సష్టం చేశారు. వివేక్.. అక్రమంగా వందల కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆరోపించారు. ఈఏడాది మొదట్లో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకా ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
మనీలాండరింగ్ కేసులో వివేకా ఈడీ ముందు హాజరయ్యారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన వ్యవహారంలో విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ మధ్య కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి ఈడీ విచారణ జరిపింది. విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీస్ మధ్య రూ. 8 కోట్ల లావాదేవీలకు సంబంధించి గతంలో హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది.దర్యాప్తులో భాగంగా గడ్డం వివేక్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. గత ఏడాది నవంబరులో ఈడీ అధికారులు వివేక్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. డొల్ల కంపెనీల పేరుతో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు తనిఖీల్లో లభించిన పత్రాలు, డిజిటల్ ఆధారాల మేరకు ఈడీ గుర్తించింది. తెలంగాణ పోలీసులకు స్వామి భక్తి ఎక్కువైందని నిప్పులు చెరిగారు. పోలీసులు… రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు వత్తుతున్నారని ఆగ్రహించారు.