Telugu Global
Telangana

బిల్డింగులు, లే ఔట్ల పర్మిషన్లకు 'బిల్డ్‌ నౌ'!

కొత్త అనుమతుల విధానం తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

బిల్డింగులు, లే ఔట్ల పర్మిషన్లకు బిల్డ్‌ నౌ!
X

తెలంగాణలో బిల్డింగులు, లే ఔట్ల పర్మిషన్లకు రాష్ట్ర ప్రభుత్వం 'బిల్డ్‌ నౌ' పేరుతో కొత్త ఆన్‌లైన్‌ అనుమతుల విధానాన్ని తీసుకువచ్చింది. సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌ బాబు ఈ విషయం వెల్లడించి, కొత్త విధానాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 60 శాతం జనాభా పట్టణాలు, నగరాల్లో నివసిస్తోందని.. వారికోసం తమ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు ప్రవేశ పెట్టిందని తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి పట్టణాభివృద్ధి శాఖను చూస్తున్నారని, రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్సిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి విధానాలు కొనగిస్తున్నామని, ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, ఇక్కడి ప్రజలే ఎక్కువ మంది హౌసింగ్‌ లోన్లు తీసుకుంటున్నారని తెలిపారు.

First Published:  3 Dec 2024 4:05 PM IST
Next Story