Telugu Global
Telangana

ఇవాళ BRSలోకి ఆర్.ఎస్‌.ప్రవీణ్‌

ఆదివారం హైదరాబాద్‌లో తన రాజకీయ భవితవ్యంపై వందలాది మంది శ్రేయోభిలాషులు, అనుచరులతో మేధోమధనం జరిపానని, రకరకాల అభిప్రాయాలు వచ్చాయన్నారు.

ఇవాళ BRSలోకి ఆర్.ఎస్‌.ప్రవీణ్‌
X

ఇటీవల BSPకి రాజీనామా చేసిన RS ప్రవీణ్‌కుమార్.. బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇవాళ ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. దేశంలో లౌకికతత్వాన్ని కాపాడడం, రాజ్యాంగ రక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.


ఆదివారం హైదరాబాద్‌లో తన రాజకీయ భవితవ్యంపై వందలాది మంది శ్రేయోభిలాషులు, అనుచరులతో మేధోమధనం జరిపానని, రకరకాల అభిప్రాయాలు వచ్చాయన్నారు. తన మీద నమ్మకంతో ఏ నిర్ణయం తీసుకున్నా వెంట నడుస్తామని హామీ ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు RSP.

తాను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటానని, వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తానని చెప్పారు.

First Published:  18 March 2024 4:50 AM
Next Story