Telugu Global
Telangana

రైతుబంధుపై ఈసీకి బీఆర్ఎస్‌ లేఖ

ఇప్పటికే వ్యవసాయ శాఖ రైతుబంధు పంపిణీ కోసం రూ.7 వేల 700 కోట్లు సిద్ధం చేసింది. అయితే చివరి నిమిషంలో ఈసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో రైతుబంధు నిధుల పంపిణీకి బ్రేక్ పడినట్లయింది.

రైతుబంధుపై ఈసీకి బీఆర్ఎస్‌ లేఖ
X

రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ వేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాసింది. బీఆర్ఎస్‌ సీనియర్ నేత కె.కేశవరావు ఆ లేఖ‌ను చీఫ్‌ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్‌ వికాస్‌ రాజ్‌కు అంద‌జేశారు.

రైతుబంధు నిధుల విడుదలకు అనుమతిని ఇస్తూ ఈసీ శనివారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే హరీష్‌ రావు రైతుబంధు నిధులు విడుదల చేస్తామంటూ చేసిన రోడ్‌షోలు, బహిరంగసభల్లో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంతో ఇవాళ ఈసీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరింది.

ఇక రైతుబంధు ద్వారా రాష్ట్రంలో 60 లక్షల మందికిపైగా రైతులు లబ్ధి పొందనున్నారు. శనివారం ఈసీ అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే వ్యవసాయ శాఖ రైతుబంధు పంపిణీ కోసం రూ.7 వేల 700 కోట్లు సిద్ధం చేసింది. అయితే చివరి నిమిషంలో ఈసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో రైతుబంధు నిధుల పంపిణీకి బ్రేక్ పడినట్లయింది.

First Published:  27 Nov 2023 2:37 PM IST
Next Story