ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. గోషామహల్‌ను గచ్చిబౌలి చేస్తాం- కేటీఆర్
బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ బిల్డింగ్‌ను పునరుద్ధరించేందుకు కృషి చేస్తామన్నారు. మూసీ నది పునరుజ్జీవనానికి శ్రీకారం చుడతామన్నారు కేటీఆర్.
బీఆర్ఎస్‌కు అవకాశమిస్తే గోషామహల్ నియోజకవర్గాన్ని గచ్చిబౌలిలా మారుస్తామని హామీ ఇచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శనివారం బీఆర్ఎస్ అభ్యర్థి నందు బిలాల్‌కు మద్దతుగా నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదని.. హిందూ, ముస్లిం మతాల మధ్య విబేధాలు సృష్టిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ బిల్డింగ్‌ను పునరుద్ధరించేందుకు కృషి చేస్తామన్నారు. మూసీ నది పునరుజ్జీవనానికి శ్రీకారం చుడతామన్నారు కేటీఆర్. మూసీనదిపై వంతెనలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కోహ్లీ 50 సెంచరీల రికార్డు తరహాలో బీఆర్ఎస్ వంద స్థానాల్లో గెలవడం ఖాయమన్నారు కేటీఆర్. బౌలర్ షమీ తరహాలో కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు.
గోషామహల్‌లో కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థిని పోటీకి పెట్టి బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు కేటీఆర్. ఈసారి నందు బిలాల్‌కు అవకాశం ఇవ్వాలని మార్వాడీ సామాజిక వర్గాన్ని కోరారు. బీఆర్ఎస్ ఇప్పటివరకూ విజయం సాధించని నియోజకవర్గాల్లో గోషామహల్ ఒకటి.