డిజిటల్ విధ్వంసం.. సీఎస్‌కు కేటీఆర్ స్పెషల్ రిక్వెస్ట్
వెబ్‌సైట్లలో కీలకమైన సమాచారం అదృశ్యం కావడం, వెబ్‌సైట్లు మాయం కావడం వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు కేటీఆర్.
తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లతో పాటు సోషల్‌మీడియా హ్యాండిల్స్‌లో కీలకమైన సమాచారం అదృశ్యం కావడంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిని ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ విషయంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లు, సోషల్‌మీడియా హ్యాండిల్స్‌లోని ముఖ్యమైన సమాచారాన్ని కనిపించకుండా చేశారని ఆరోపించారు కేటీఆర్. కొన్ని కీలకమైన వెబ్‌సైట్‌లను పూర్తిగా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయింటెనెన్స్ ఇష్యూ పేరిట ప్రముఖ సైట్లను ప్రజలకు దూరంగా ఉంచారన్నారు కేటీఆర్. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు అనిపిస్తోందన్నారు.
Smt Santhi Kumari Garu,@TelanganaCS
— KTR (@KTRBRS) July 2, 2024
I request your urgent intervention regarding digital vandalism of Telangana Govt websites & social media handles
➡️ After the Congress party formed the government in December 2023, vital content on Telangana Government websites and social… pic.twitter.com/ufaKaB9J7h
వెబ్‌సైట్లలో కీలకమైన సమాచారం అదృశ్యం కావడం, వెబ్‌సైట్లు మాయం కావడం వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు కేటీఆర్. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ పరిపాలనకు సంబంధించిన వేలాది ఫొటోలు, వీడియోలు, ముఖ్యమైన సమాచారాన్ని తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.
ముఖ్యమైన కంటెంట్‌ను ఆర్కైవ్స్‌లో భద్రపరచాలని కోరారు కేటీఆర్. తొలగించడం సరికాదన్నారు. విలువైన ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడాన్ని భవిష్యత్ తరాలు క్షమించవన్నారు. సీఎస్ వెంటనే స్పందించి విలువైన సమాచారాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలన్నారు. తొలగించిన సమాచారానికి సంబంధించిన వివరాలను సీఎస్‌కు పంపిస్తానన్నారు.