Telugu Global
Telangana

ఇవాళ నల్గొండకు కేటీఆర్.. ఎందుకంటే..!

గన్నేబోయిన మల్లయ్య వీడియోపై స్పందించిన కేటీఆర్.. తన గుండెలను తాకిందని ట్వీట్ చేశారు. త్వరలోనే మల్లయ్యను కలుస్తానని ట్వీట్ చేశారు.

ఇవాళ నల్గొండకు కేటీఆర్.. ఎందుకంటే..!
X

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు. పార్లమెంటరీ పార్టీ సన్నాహక సమావేశంలో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి పాల్గొంటారు. పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపు కోసం పని చేయాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి నల్గొండ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలు, నేతలు హాజరుకానున్నారు.

దీంతో పాటు సాగు నీరందక పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను కేటీఆర్ పరామర్శించనున్నారు. నల్గొండ సమీపంలోని ముషంపల్లి గ్రామానికి చెందిన గన్నేబోయిన మల్లయ్య, బోర్ల రాంరెడ్డి ఇంటికి వెళ్లి భరోసా కల్పించనున్నారు. కొన్ని రోజుల క్రితం మల్లయ్యకు సంబంధించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

గన్నేబోయిన మల్లయ్య వీడియోపై స్పందించిన కేటీఆర్.. తన గుండెలను తాకిందని ట్వీట్ చేశారు. త్వరలోనే మల్లయ్యను కలుస్తానని ట్వీట్ చేశారు. ఇక బోర్ల రాంరెడ్డి కథ మళ్లీ మొదటికి వచ్చింది. గత నాలుగు నెలల్లో ఆరు బోర్లు వేసి నష్టపోయారు రాంరెడ్డి. దాదాపు 30 ఎకరాలకు పైగా పంట ఎండిపోయింది. దీంతో ఇచ్చిన మాట మేరకు ఈ ఇద్దరు రైతులను ఇవాళ కలిసి భరోసా ఇవ్వనున్నారు కేటీఆర్.

First Published:  1 April 2024 9:11 AM IST
Next Story