అభిమాని ఇంటికెళ్లి సర్‌ప్రైజ్ చేసిన కేటీఆర్..!
ఇబ్రహీం ఖాన్ పిల్లలు మూగ చెవుడు సమస్యతో బాధపడుతుండటంతో వారి చికిత్సకు అయ్యే ఖర్చులు భరించేందుకు కేటీఆర్ ముందుకు వచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కేటీఆర్.. సాయం కావాలని ఎవరూ ట్వీట్ చేసినా.. నేనున్నానంటూ ముందుకు వస్తారు. తాజాగా ఓ అభిమాని తన ఇంటికి రావాలని ట్విట్టర్‌లో ఆహ్వానించగా.. ఆ అభిమాని ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేశారు కేటీఆర్. వారింట్లో ఆతిథ్యం కూడా స్వీకరించారు.
Happy to have kept my promise to Ibrahim Khan Bhai
— KTR (@KTRBRS) January 7, 2024
Visited his home in Borabanda; Met his affectionate family who offered fabulous Biryani and sheer khurma. Loved the food and hospitality
Also offered to assist his brother’s kids who have a hearing impairment https://t.co/ETCVeQL71V pic.twitter.com/cQUb6EnLYy
ఇంతకీ ఏం జరిగిందంటే.. హైదరాబాద్ బోరబండకు చెందిన ఇబ్రహీం ఖాన్ జనవరి 1వ తేదీన కేటీఆర్‌కు న్యూ ఇయర్ విషెస్ చేప్తూ ఓ ట్వీట్ చేశారు. ఇందులో బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనపై ప్రశంసలు కురిపించాడు ఇబ్రహీం. ఈ ఐదేళ్లు బీఆర్ఎస్‌కు ఇంటర్వెల్ లాంటిదని.. మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ సర్కారేనంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. చివర్లో తన ఇంటికి ఆతిథ్యానికి రావాలంటూ కేటీఆర్‌ను కోరారు. ఇబ్రహీం ఖాన్ ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చిన కేటీఆర్.. త్వరలోనే వస్తానంటూ మాట ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం బోరబండలోని ఇబ్రహీం ఖాన్ ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు. అంతేకాదు ఇబ్రహీం ఖాన్ పిల్లలు మూగ చెవుడు సమస్యతో బాధపడుతుండటంతో వారి చికిత్సకు అయ్యే ఖర్చులు భరించేందుకు కేటీఆర్ ముందుకు వచ్చారు. కేటీఆర్ వెంట స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూడా ఉన్నారు.