జిల్లాలపై రేవంత్ కామెంట్స్..కేటీఆర్ వార్నింగ్..!
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్‌పై స్పందించారు కేటీఆర్. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు సిట్టింగ్‌లను మార్చి ఉంటే బీఆర్ఎస్ గెలిచి ఉండేదన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు జరిగాయన్నారు. కొన్ని స్థానాల్లో ఓటమిని అసలు ఊహించలేదన్నారు. జుక్కల్‌లో హన్మంతు షిండే ఓడిపోతారని అనుకోలేదన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 1985-89 మధ్య ఎన్టీఆర్ అద్భుతమైన పథకాలు తెచ్చినప్పటికీ ఓడిపోయారని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాట్లు లోక్‌సభ ఎన్నికల్లో జరగకుండ చూసుకుంటామన్నారు.
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్‌పై స్పందించారు కేటీఆర్. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. తాము తొందరపడి ప్రభుత్వం విమర్శలు చేయడం లేదన్న కేటీఆర్.. ప్రజల్లో కేసీఆర్‌పై ఆదరణ తగ్గలేదన్నారు. కాంగ్రెస్ అనవసరంగా బీఆర్ఎస్‌ను విమర్శిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమన్నారు కేటీఆర్. త్రిముఖ పోరులో బీఆర్ఎస్‌కే మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఓటమిలో దళితబంధు, బీసీ బంధు లాంటి పథకాల ప్రభావం కూడా ఉందన్నారు. కొందరికి పథకాలు ఇస్తే మిగతా వాళ్లు ఈర్ష్య పడే పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉందన్నారు.