Telugu Global
Telangana

జీరో.. కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్

హక్కుగా వచ్చే నిధులు కూడా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా లేదని, నీతి ఆయోగ్ సిఫార్సులను సైతం కేంద్రం పట్టించుకోలేదని BRS చాలా సార్లు ఆరోపించింది.

జీరో.. కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్
X

కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇవాళ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఏం దక్కనుందో చెప్పాలని ఓ జర్నలిస్టు తనను అడిగారన్నారు. అయితే గత 10 సంవత్సరాలుగా తెలంగాణకు ఏం దక్కిందో ఈసారి కూడా అదే దక్కనుందని సమాధానమిచ్చానన్నారు కేటీఆర్. ఈసారి కూడా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జీరోనే వస్తుందంటూ ట్వీట్ చేశారు.


దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందన్న విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో రూపాయి వెళ్తే.. తిరిగి వచ్చేది అర్ధ రూపాయేనని గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం విమర్శలు చేసింది. హక్కుగా వచ్చే నిధులు కూడా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా లేదని, నీతి ఆయోగ్ సిఫార్సులను సైతం కేంద్రం పట్టించుకోలేదని చాలా సార్లు ఆరోపించింది. ఇక ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు IIM, నవోదయ విద్యాలయాలు, మెడికల్ కాలేజీల మంజూరులోనూ తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపింది.

సౌత్ సెంట్రల్ రైల్వే పనితీరు మెరుగ్గా ఉన్నప్పటికీ.. కొత్త లైన్లకు నిధుల కేటాయింపులో కేంద్రం మొండి చేయి చూపుతోంది. ఇక దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమలపై కేంద్రం ఉలుకుపలుకు లేదు. గత రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలకు సంబంధించి ఎన్ని విజ్ఞప్తులు చేసినా, లేఖలు రాసినా కేంద్రం నుంచి సరైన సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర బడ్జెట్‌లో కొత్తగా వచ్చేదేం లేదంటూ తన నిరాశను వ్యక్తం చేశారు కేటీఆర్.

First Published:  23 July 2024 4:01 AM GMT
Next Story