Telugu Global
Telangana

రేవంత్ రెడ్డి లీకు వీరుడు - కేటీఆర్

ఇప్పుడు ఆరు గ్యారంటీలు పక్కకుపోయి.. ఆరు గారడీలు మొదలయ్యాయన్నారు కేటీఆర్. కాళేశ్వరం స్కామ్, గొర్ల స్కామ్, బర్ల స్కామ్, ఫోన్ల ట్యాపింగ్ అంటూ రోజుకో కథను ప్లే చేస్తున్నారన్నారు.

రేవంత్ రెడ్డి లీకు వీరుడు - కేటీఆర్
X

సీఎం రేవంత్‌ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. ఆరు గ్యారంటీలు అమలు చేయలేక రేవంత్ ప్రభుత్వం ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు ఆరు ట్రిక్స్ ప్లే చేస్తుందంటూ ఆరోపించారు.


ఇప్పుడు ఆరు గ్యారంటీలు పక్కకుపోయి.. ఆరు గారడీలు మొదలయ్యాయన్నారు కేటీఆర్. కాళేశ్వరం స్కామ్, గొర్ల స్కామ్, బర్ల స్కామ్, ఫోన్ల ట్యాపింగ్ అంటూ రోజుకో కథను ప్లే చేస్తున్నారన్నారు. ఓ చోట కేసీఆర్‌ పది లక్షల ఫోన్లు ట్యాపింగ్ చేశారని రాశారని.. చేస్తే ఒకరో, ఇద్దరో దొంగల ఫోన్లు ట్యాప్ చేసుండొచ్చన్నారు కేటీఆర్. ఆ విషయం తనకు పెద్దగా తెలియదన్నారు. అది పోలీసుల పని అని చెప్పుకొచ్చారు. కానీ, ఏదో జరిగిపోయిందన్నట్లుగా డ్రామాలు ప్లే చేస్తున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్. రైతుబంధు, 4 వేల పెన్షన్‌ హామీల నుంచి ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకే ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారన్నారు కేటీఆర్.

రేవంత్ రెడ్డికి దమ్ముంటే.. లీకులు బంద్‌ చేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సవాల్ విసిరారు కేటీఆర్. రేవంత్‌కు పాలన చేతకావట్లేదని.. అందుకే రోజుకో లీకుతో కాలం వెల్లదీస్తున్నారన్నారు. రేవంత్‌ రెడ్డి లీకు వీరుడిగా మారారంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. రుణమాఫీ, రైతుబంధు అందితే కాంగ్రెస్‌కు ఓటేయాలని.. అందని వారంతా బీఆర్ఎస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్.

First Published:  27 March 2024 3:39 PM IST
Next Story