ఎన్నికలయ్యాక బీజేపీలోకి వెళ్లే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి
మోడీ చౌకీదార్ చోర్‌హై అని ఢిల్లీలో రాహుల్ గాంధీ అంటే.. కాదుకాదు మోడీ మా పెద్దన్నా అని రేవంత్ అంటాడు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ గాంధీ అంటే.. లేదులేదు అదానీ మా ఫ్రెండ్ అని రేవంత్ రెడ్డి అంటాడు.
ఎన్నికలయ్యాక బీజేపీలోకి వెళ్లే మొట్టమొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. "బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని మైనార్టీ సోదరులను కాంగ్రెస్ మభ్య పెట్టింది. బీజేపీకి బీటీమ్ బీఆర్ఎస్ అని ఎన్నికలకు ముందు అడ్డగోలుగా మాట్లాడింది. రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి దాకా ఇదే పాట పాడారు. మరి ఇవాళ దేశంలో ఏం జరుగుతోంది?. ఢిల్లీలో అక్కడ రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడో, గల్లీలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో జనం బాగా గమనించాలి".
"మోడీ చౌకీదార్ చోర్‌హై అని ఢిల్లీలో రాహుల్ గాంధీ అంటే.. కాదుకాదు మోడీ మా పెద్దన్నా అని రేవంత్ అంటాడు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ గాంధీ అంటే.. లేదులేదు అదానీ మా ఫ్రెండ్ అని రేవంత్ రెడ్డి అంటాడు. లిక్కర్ స్కామ్ లేదు ఏమీ లేదు. అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయం అని వాళ్ల నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో మీటింగ్ పెడుతాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వాళ్లేమో లిక్కర్ స్కాం జరిగింది. కవితమ్మ అరెస్ట్ కరెక్టే అని మాట్లాడుతారు. రాహుల్ గాంధేమో గుజరాత్ మోడల్ ఫేక్ అంటాడు. రేవంత్ రెడ్డేమో తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తా అంటాడు. అసలు రేవంత్ రెడ్డి ఎవరికోసం పనిచేస్తున్నాడు?. మోడీ కోసం పనిచేస్తుండా, రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా? జనం ఆలోచించాలి".
"మైనార్టీ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్‌కు ఒక్క ఓటేసినా అది వెళ్లేది బీజేపీకే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత శరణు కోసం, షెల్టర్ కోసం, భవిష్యత్తు కోసం, కేసుల నుంచి బయటపడటం కోసం కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ అయ్యే మొట్ట మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డే అన్న విషయం గుర్తు పెట్టుకోండి" అన్నారు కేటీఆర్. నల్లగొండ లోక్‌సభ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.