Telugu Global
Telangana

క్షమాపణ చెప్పిన చిదంబరం.. కేటీఆర్ రియాక్షన్ ఇదే.!

చిదంబరం కామెంట్స్‌పై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది చిదంబరం జీ అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంలో క్షమాపణ చాలా చిన్నదని చెప్పారు.

క్షమాపణ చెప్పిన చిదంబరం.. కేటీఆర్ రియాక్షన్ ఇదే.!
X

కాంగ్రెస్‌ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో మాట్లాడిన చిదంబరం తెలంగాణ ఉద్యమంలో బలిదానాలను మరోసారి గుర్తుచేశారు. అందుకు ఆయన క్షమాపణలు చెప్పారు. కానీ, వారి బలిదానాలకు కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యురాలిని చేయలేమన్నారు. రాష్ట్రం ఏర్పాటు అంత సులువైన విషయం కాదన్నారు చిదంబరం. తెలంగాణ ఏర్పాటు ప్రజా ఉద్యమం ఫలితమే అని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర కేసీఆర్‌కు తెలియదంటూ కామెంట్స్ చేశారు చిదంబరం. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే చిదంబరం కామెంట్స్‌పై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది చిదంబరం జీ అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంలో క్షమాపణ చాలా చిన్నదని చెప్పారు. 1952 - 2014లో తెలంగాణ వచ్చే వరకు వందలాది యువకులు చనిపోవడానికి కాంగ్రెస్‌దే బాధ్యత అన్నారు కేటీఆర్. ఇప్పుడు ఎంత కష్టపడినా కాంగ్రెస్‌ తెలంగాణ విషయంలో చేసిన దౌర్జన్యాలను ఇక్కడి ప్రజలు అంత సులువుగా మర్చిపోరన్నారు కేటీఆర్.


2004లో తెలంగాణను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌.. పదేళ్లు నాన్చిన విషయం తెలిసిందే. 2009లో తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంది. 2014లో తెలంగాణను కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేసింది కాంగ్రెస్. అయితే ఈ పదేళ్ల కాలంలో వందలాది తెలంగాణ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా చిదంబరం చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు మండిపడుతున్నారు. హంతకులే సంతాపం తెలిపినట్లుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

First Published:  16 Nov 2023 9:24 PM IST
Next Story